Cyberabad case: డిజిటల్ అరెస్టుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు మరో బడా సైబర్ నేరగాడిని అరెస్టు చేశారు. నగరం లోని బాలానగర్ లో ఓ వృద్దుడిని గత ఫిబ్రవరి నెలలో 15 రోజుల పాటు డిజిటల్ అరెస్టు పేరిట ఇంట్లోనే బంధించి 42 లక్షల రూపాయలు కాజేసిన ఘటనలో ఈ నేరగాడు పట్టుబడ్డాడు.
పట్టుబడ్డ నేరగాడు జగిత్యాల జిల్లా మేడిపల్లి కట్లకుంటకు చెందిన వాడుగా ఇతను సొంతంగా ఒక ముఠా ను నిర్వహిస్తున్నట్లు తేలింది. వృద్ధుడి నుంచి కొట్టేసిన 42 లక్షల రూపాయల నగదులో 12 లక్షల రూపాయలు నేరగాడి బ్యాంకు ఖాతా నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సైబర్ క్రైం డిసిపి సాయి మనోహర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
Read Also:Extramarital affair : వివాహేతర సంబంధాలు… తెలంగాణలో రెండు దారుణాలు
Cyberabad case: Elderly man threatened and robbed of Rs. 42 lakh in the name of digital arrest
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన గాజర్ల అవినాష్ (26) కొంతకాలం క్రితం డాటా ఎంట్రీ ఉద్యోగం కోసం కాంబోడియా దేశానికి వెళ్లి అంత ర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాలతో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో భారత్లో వెలుగు చూసిన అనేక సైబర్ నేరాలలో ఇతను పాల్గొన్నాడు. అయితే అక్కడి నుంచి బయటకు వచ్చాక అవినాష్ జగిత్యాల డిజిటల్ అరెస్టు ఘటనకు సంబంధించి నిందితుడి అరెస్టు వివరాలు సైబరాబాద్ సైబర్ క్రైం డిసిపి సాయి మనోహర్ వెల్లడించారు. ఈ ముఠాలో మరో నలుగురు వుండగా వీరంతా కొన్ని రోజుల క్రితం మరో కేసులో అరెస్టయ్యారు.
ఆ కేసులో అవినాష్ కూడా నింది తుడుగా వున్నాడు. కాగా అవినాష్ తన ముఠాతో కలిసి గత ఫిబ్రవరి నెలలో బాలానగర్లో ఓ వృద్దుడిని టార్గెట్ చేశాడు. మీపై 17 కేసులున్నాయి. ఇందులో సైబర్ క్రైంతో పాటు అనేక తీవ్రమైన కేసులున్నాయని బెదిరించి 15 రోజుల పాటు ఇంట్లోనే డిజిటల్ అరెస్టు పేరిట బంధించాడు. ఈ క్రమంలో వృద్దుడి బ్యాంకు ఖాతా నుం చి 42 లక్షల రూపాయలను తాను సూచించిన బ్యాంకుల ఖాతాలకు మళ్లించుకున్నాడు. దీని తరువాత వృద్దుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేబట్టగా నిందితుడు అవినాష్ గురించి వెలుగు చూసింది. నిందితుడి కోసం దాదాపు రెండు నెలల ను oచి గాలించగా గురువారం రాత్రి పట్టుబడ్డాడు. ఇతని బ్యాంకు ఖాతాలో వృద్దుడి నుంచి కాజేసిన నగదులో 12 లక్షల రూపాయలుండగా దానిని పోలీసులు జప్తు చేశారు. నిందితుడు అనేక సైబర్ నేరాలలో పాల్గొన్నట్లు తేలింది. అవినాష్తో పాటు అతని ముఠాపై వున్న కేసుల గురించి పోలీ సులు ఆరా తీస్తున్నారు. సైబర్ నేరాలతో పాటు డిజిటల్ అరెస్టుపై అందరు అప్రమత్తంగా వుండాలని సైబర్ క్రైం డిసిపి సాయి మనోహర్ కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

