Dailyhunt
డీలిమిటేషన్ అప్‌డేట్.. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు ఇవే!

డీలిమిటేషన్ అప్‌డేట్.. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు ఇవే!

వార్త 6 days ago

Amit Shah on Delimitation: లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు.

డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని, పైగా సంఖ్యాపరంగా మరియు నిష్పత్తి పరంగా సీట్లు పెరుగుతాయని ఆయన లోక్‌సభలో స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ ప్రక్రియపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ కీలక గణాంకాలను వెల్లడించారు.

Read Also: Delimitation: డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ భరోసా: "విభజన రాజకీయాలు వద్దు.. దేశాభివృద్ధే ముఖ్యం!"

రాష్ట్రాల వారీగా పెరగనున్న సీట్ల వివరాలు:

అమిత్ షా వివరణ ప్రకారం, లోక్‌సభ మొత్తం సీట్ల సంఖ్య పెరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల సీట్ల అంచనా ఇలా ఉండబోతోంది

రాష్ట్రంప్రస్తుత సీట్లుపెరిగే అవకాశం ఉన్న సీట్లు
ఆంధ్రప్రదేశ్2538
తెలంగాణ1726
తమిళనాడు3959
కర్ణాటక2842
కేరళ2030

ప్రస్తుతం లోక్‌సభలోని 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 129 (23.76%) కాగా, పునర్విభజన తర్వాత అది 195 స్థానాలకు (23.97%) పెరుగుతుందని ఆయన లెక్కలతో సహా వివరించారు.

విపక్షాల ఆందోళన – కేంద్రం కౌంటర్

జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమకు, జనాభా ప్రాతిపదికన జరిగే విభజన వల్ల అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కేవలం జనాభాను మాత్రమే కాకుండా ఆర్థిక సూచికలను (GSDP) కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అటు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ బిల్లుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అయితే, ప్రతిపక్షాలు అనవసర భయాలు సృష్టిస్తున్నాయని, ఏ రాష్ట్రానికీ నష్టం జరగకుండానే సభ విస్తరణ ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారు.

Amit Shah on Delimitation: భవిష్యత్తు ప్రణాళిక

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సీట్ల సంఖ్యను 816 నుంచి 850 మధ్యకు పెంచి, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ పూర్తయితే పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ గణాంకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కేంద్రం వైఖరిని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లోక్‌సభలో ప్రియాంక గాంధీ కౌంటర్ అటాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha