Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దీపావళి వరకు ఆందోళనలు నిలిపివేయాలని కార్యకర్తలకు సీజేపీ పిలుపు

దీపావళి వరకు ఆందోళనలు నిలిపివేయాలని కార్యకర్తలకు సీజేపీ పిలుపు

వార్త 3 days ago

Abhijit Deepke: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా కోరుతూ కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలను దీపావళి పండుగ వరకు తాత్కాలికంగా ఆపేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పండుగ వేళ కార్యకర్తలందరూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

కుటుంబాల ఆవేదన దృష్ట్యా తాత్కాలిక విరామం

నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్న యువత ఆరోగ్యం, క్షేమం గురించి వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తు చేస్తున్నారని అభిజీత్ తెలిపారు. తనతో పాటు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పార్టీ ముఖ్య నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌ల కుటుంబాలు కూడా ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాయని చెప్పారు. ఈ సున్నితమైన అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఆందోళనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ బొద్దింక దిష్టిబొమ్మ దహనం

మరోవైపు, విజయదశమి పండుగను పురస్కరించుకుని ఢిల్లీలోని ప్రముఖ రామ్‌లీలా మైదానంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. సాధారణంగా దహనం చేసే రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలతో పాటు ఈసారి ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మను కూడా దహనం చేయాలని రామ్‌లీలా ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఢిల్లీ’ అభియాన్‌లో భాగంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

రామ్‌లీలా కమిటీ నిర్ణయంపై సీజేపీ వ్యవస్థాపకుడి వ్యంగ్యాస్త్రాలు

రామ్‌లీలా కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనదైన శైలిలో స్పందించారు. తమ పార్టీకి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పబ్లిసిటీ కల్పిస్తున్నందుకు రామ్‌లీలా కమిటీకి ఆయన వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha