Jawa Motorcycles : ఈ దీపావళి పండుగ సందర్భంగా మోటార్ సైకిల్ ప్రియులకు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. జావా, యెజ్డీ, BSA బ్రాండ్ల బైక్‌లను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం ప్రత్యేక పండగ ఫైనాన్స్ పథకాలతో పాటు 'టెస్ట్ రైడ్ చేయండి..
మీరు కలలు కనే బైక్ గెలవండి’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్నవారు సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించి తమకు నచ్చిన బైక్‌ను టెస్ట్ రైడ్ చేయవచ్చు. ఈ ప్రచారంలో పాల్గొనడం ద్వారా తాము కోరుకున్న మోటార్ సైకిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఇక కొనుగోలుదారులపై ఆర్థిక భారం తగ్గించేలా ఆకర్షణీయమైన ఫైనాన్స్ సదుపాయాలను కూడా సంస్థ అందిస్తోంది. ప్రతి లక్ష రూపాయల రుణానికి నెలకు రూ.1,888 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐలు, 4.75 శాతం నుంచి వడ్డీ రేట్లు, కేవలం రూ.4,999 నుంచి డౌన్ పేమెంట్‌తో బైక్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఆఫర్లు పండగ సమయంలో కొత్త బైక్ కొనాలనుకునే వారికి మరింత వెసులుబాటు కల్పించనున్నాయి.
జావా, యెజ్డీ, BSA బ్రాండ్లు ఒక్కొక్కటి ప్రత్యేకమైన డిజైన్, పనితీరు, రైడింగ్ అనుభూతితో బైక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయని క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా తెలిపారు. చాలామందికి మోటార్ సైకిల్ కొనాలనే కల రోడ్లపై చూసిన బైక్‌లతోనో, ఆన్‌లైన్‌లో తెలుసుకున్న మోడళ్లతోనో ప్రారంభమవుతుందని, అలాంటి కలలను నిజం చేసుకునేందుకు ఈ పండగ కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జావా తన క్లాసిక్ స్టైల్‌తో, యెజ్డీ అడ్వెంచర్ స్ఫూర్తితో, BSA బ్రిటీష్ మోటార్ సైకిల్ వారసత్వంతో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయని వివరించారు. ఈ మూడు బ్రాండ్లలో తమ అభిరుచికి తగిన బైక్‌ను ఎంచుకునేందుకు కస్టమర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ దీపావళికి బైక్ కొనుగోలుతో పాటు టెస్ట్ రైడ్ ద్వారా మోటార్ సైకిల్ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తూ సంస్థ ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని అధీకృత జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ షోరూమ్‌ను సందర్శించి టెస్ట్ రైడ్, ఫైనాన్స్ ఆఫర్లు, ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు తెలుసుకోవచ్చు.
హార్లీ డేవిడ్‌సన్ 'స్ప్రింట్ 440' ఆవిష్కరణ.. అదిరిపోయే ఫీచర్లు

