Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిసెంబర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి?

డిసెంబర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి?

వార్త 1 week ago

Cricketer Rinku Singh: టీమిండియా దూకుడుగల బ్యాటర్, క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. 2026 డిసెంబర్ 4న లక్నోలోని ప్రతిష్టాత్మక 'రమాడా హోటల్' వేదికగా ఈ జంట ఏడడుగులు నడవనుంది.

ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ వేడుకకు సంబంధించిన అతిథుల జాబితా కూడా దాదాపు ఖారారైనట్లు సమాచారం.

Read Also : Prithvi Shaw Akriti Agarwal: విడిపోతున్నామన్న కొన్ని వారాలకే యూటర్న్.. పృథ్వీ షా జంట ప్రకటన

 Rinku Singh and Priya Saroj to marry on December 4?

Cricketer Rinku Singh: రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖుల హాజరు

ఈ హై-ప్రొఫైల్ వివాహ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రియా సరోజ్ కుటుంబం తరఫున రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందనున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సుప్రియా సూలే, పలువురు కేంద్ర మంత్రులను ఈ వివాహానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, రింకూ సింగ్ తరఫున బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు ప్రముఖ భారత క్రికెటర్లు ఈ వేడుకలో పాల్గొననున్నారు. వీఐపీ అతిథుల సౌకర్యార్థం లక్నోలోని రమాడా హోటల్‌తో పాటు ప్రముఖ హోటల్ 'తాజ్'లో కూడా ప్రత్యేక గదులను బుక్ చేసినట్లు సమాచారం.

2025లో నిశ్చితార్థం..

ప్రియా సరోజ్, రింకూ సింగ్‌ల నిశ్చితార్థం గతంలో అనగా 2025 జూన్‌లో ఘనంగా జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరి ప్రేమకథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి పరిచయం, ప్రేమకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను రింకూ సింగ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. మొదట్లో ప్రియా సరోజ్ తనను కలవడానికి పెద్ద స్నేహితుల బృందంతో వచ్చారని, ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారిందని ఆయన తెలిపారు. సంప్రదాయబద్ధంగా జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం అభిమానులు, ఇరు కుటుంబాల వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలి రంజీ మ్యాచ్.. శతకంతో అదరగొట్టిన పోరెల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha