Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిసెంబర్ మూడో వారంలో 'NBK 111' విడుదల

డిసెంబర్ మూడో వారంలో 'NBK 111' విడుదల

వార్త 3 months ago

NBK 111 : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK 111' (వర్కింగ్ టైటిల్) విడుదలపై టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది.

ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

బాక్సాఫీస్ ప్లానింగ్: ‘ఫౌజీ’ ఎఫెక్ట్.. సంక్రాంతి టార్గెట్!

ఈ ఏడాది డిసెంబర్ రేసులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా డిసెంబర్ 3న భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించేందుకు మరియు థియేటర్ల లభ్యతను దృష్టిలో ఉంచుకుని, బాలయ్య సినిమాను ‘ఫౌజీ’ వచ్చిన రెండు వారాల తర్వాత (డిసెంబర్ మూడో వారంలో) థియేటర్లలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మిడ్ వీక్‌లో రిలీజ్ చేయడం వల్ల సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులతో పాటు జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ వరకు లాంగ్ రన్ లభించే గోల్డెన్ ఛాన్స్ ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే, ఈ విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రెగ్నెన్సీలోనూ తగ్గేదే లే.. 'రాకా' సినిమా కోసం యాక్షన్ సీన్స్‌లో దీపికా పదుకొణె!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha