Hedgehog!: శ్రీలంకలోని పొలొన్నరువ ప్రాంతానికి చెందిన ఒక చిన్నారి, వన్యప్రాణి అయిన ముళ్లపంది (Porcupine) మధ్య ఉన్న అపూర్వమైన స్నేహ బంధం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వరి పొలం గట్ల వెంట ఆ బాలిక పరిగెడుతుంటే, ఆమె వెనుకే ఒక ముళ్లపంది కూడా ఎంతో ఇష్టంగా అనుసరించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జంతువులతో ఎంతో సున్నితంగా, ప్రేమగా మెలిగే డిస్నీ కార్టూన్లలోని యువరాణిలా ఆ బాలిక కనిపిస్తుండటంతో, నెటిజన్లు ఆమెను “రియల్ లైఫ్ డిస్నీ యువరాణి” (Disney Princess) అని అభివర్ణిస్తున్నారు.ఈ అరుదైన స్నేహ బంధం వెనుక ఒక హృదయ విదారక, మానవీయ కోణం దాగి ఉంది. గతంలో ఒకసారి వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈ ముళ్లపందిని ఆ బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులు రక్షించారు. దానికి ఆశ్రయం కల్పించి, గాయాలను నయం చేసి ప్రాణదానం చేశారు. అప్పటి నుండి ఆ ముళ్లపంది వారిపై విపరీతమైన నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుకుంది. ఆ కుటుంబం కేవలం ముళ్లపందినే కాకుండా, దానితో పాటు వచ్చే అడవి పిల్లులను కూడా ఆదరిస్తూ సంరక్షిస్తున్నారు.
Read Also: Europe Heatwave: యూరప్ ఎండలపై యూపీ యువతి ఆవేదన..ఇక్కడ 33°C కే చచ్చిపోతున్నాం!
Hedgehog!
Hedgehog!: భాషను దాటిన బంధం – వన్యప్రాణుల నిపుణుల విశ్లేషణ
ఈ వీడియోలో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ బాలిక స్థానిక “సింహళం” భాషలో ఆ ముళ్లపంది, పిల్లులతో మాట్లాడుతుంటే.. అవి ఆమె మాటలను అర్థం చేసుకున్నట్లుగా ప్రవర్తించడం విశేషం. ముళ్లపందులు సహజంగా శాఖహారులు మరియు ఇవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. కానీ, ఈ బాలిక చూపిన నిష్కల్మషమైన ప్రేమ వల్ల ఆ అడవి ప్రాణి తన రక్షణ కవచాలైన ముళ్లను పక్కన పెట్టి, ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోయింది.
Epaper: epaper.vaartha.com
బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ దాడులు.. అమెరికాకు టెహ్రాన్ హెచ్చరిక

