Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'డ్రాగన్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్!

'డ్రాగన్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్!

వార్త 6 days ago

Dragon movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా గ్లింప్స్ అంటే ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఉంటుంది, కానీ ఈ చిత్రానికి ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ నిడివితో గ్లింప్స్ రాబోతుంది.

Read Also : Keerthy Suresh: బాడీ షేమింగ్, సర్జరీ పుకార్లపై కీర్తి సురేష్ స్పందన

Dragon movie: రేపు రాత్రి విధ్వంసం షురూ!

తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు ఈ గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనే కాకుండా, దేశవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో కూడా ప్రదర్శించనుండటం విశేషం. ఇప్పటికే ఈ భారీ వీడియోకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీనికి బోర్డు U/A 16+ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. "విధ్వంసం మరో రేంజ్‌లో ఉంటుంది" అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.

గ్లోబల్ బ్లాక్‌బస్టర్ 'RRR', 'దేవర' వంటి భారీ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం.. మరోవైపు 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దీనికి దర్శకుడు కావడంతో 'డ్రాగన్'పై దేశవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'టాక్సిక్' సినిమా ఆలస్యంపై స్పందించిన యశ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha