Mahabubnagar Drugs Eradication: మాదకద్రవ్యాల (Drugs) మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను నేరస్తులుగా చూడొద్దు. వారిని సరైన ప్రేమ, మార్గదర్శకత్వం, మానసిక చికిత్స అవసరమైన బాధితులుగా గుర్తించి ఆదరించాలి' అని మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) డి.
జానకి ధరావత్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసులతోనే సాధ్యం కాదని, ఇందుకు సమాజంలోని అన్ని వర్గాల సమిష్టి కృషి ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ముందస్తు చర్యల్లో భాగంగా.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH) లోని ప్రత్యేక డి-అడిక్షన్ సెంటర్ (De-Addiction Centre) ను జిల్లా ఎస్పీ జానకి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న వైద్య సేవలను, కౌన్సెలింగ్ విధానాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి వైద్య బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Read Also : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న - రేవంత్
బాధితుల పునరావాసంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ
డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను ఎస్పీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎంతమంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు, వారికి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, చికిత్స తీసుకున్న తర్వాత వారి మానసిక ప్రవర్తనలో వస్తున్న మార్పులు ఏంటి అనే విషయాలపై డాక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం కేంద్రంలో వసతులు పొందుతున్న బాధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడి 'ఫీడ్‌బ్యాక్' సేకరించారు. వారికి ఆసుపత్రిలో అందుతున్న కౌన్సెలింగ్ విధానం, మందుల సరఫరా మరియు ఈ కష్టకాలంలో వారికి కుటుంబ సభ్యుల నుండి లభిస్తున్న మద్దతుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన సమయంలో అందించే వైద్య చికిత్స, నిరంతర సైకలాజికల్ కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల అండ ఉంటే ఎంతటి వ్యసనపరుడినైనా మళ్లీ సాధారణ జీవితంలోకి విజయవంతంగా తీసుకురావచ్చని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.

Mahabubnagar Drugs Eradication: యువతను రక్షించుకుందాం - ఎస్పీ జానకి విజ్ఞప్తి
జిల్లాలో మాదకద్రవ్యాల రహిత సమాజ స్థాపనకు పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాసంస్థలు, మరియు తల్లిదండ్రులు ఒకరికొకరు సమన్వయంతో ఒక విధివిధానం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువత ఈ డ్రగ్స్ బారిన పడకుండా కళాశాలలు, పాఠశాలల్లో విరివిగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా, వినియోగం జరుగుతున్నట్లు అనుమానం వస్తే.. తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీర, డీఎస్పీ రమణా రెడ్డి, సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ రాజ్, ఆర్ఎంఓ డాక్టర్ దుర్గా, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
పవన్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా మాకు ఏంకాదు - మహేష్ కుమార్

