Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ఐఏఎస్ తనయుడికి పాజిటివ్

డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ఐఏఎస్ తనయుడికి పాజిటివ్

వార్త 4 months ago

Gachibowli Pub Drugs Raid: రాజధానిలోని ఐటీ హబ్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. కొండాపూర్‌లోని 'క్వాక్ ఎరీనా' (Quack Arena) పబ్‌పై తెలంగాణ స్టేట్ టాస్క్‌ఫోర్స్ 'ఈగల్' బృందం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

Read Also:Hanamkonda crime: మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య ఇద్దరు కూతుళ్లను హతమార్చిన భర్త

 Key turning point in drugs case.. IAS son tests positive

Gachibowli Pub Drugs Raid: 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అక్కడ ఉన్న సుమారు 64 మందికి స్పాట్‌లోనే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఆరుగురు గంజాయి సేవించగా, మరో ఇద్దరు మెతాంఫేటమిన్ వంటి ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఐఏఎస్ అధికారిణి కుమారుడు అరెస్ట్

డ్రగ్స్ తీసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి కుమారుడు అకెళ్ల హరిత్ సారంగ కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన వారందరినీ వెంటనే అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఆవేశంలో భర్త ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha