Dailyhunt
డ్రగ్స్ పార్టీ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

డ్రగ్స్ పార్టీ కేసు.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

వార్త 1 week ago

Moinabad Drug Case: తెలంగాణలోని మొయినాబాద్ డ్రగ్ పార్టీ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది.

ఈ నిర్ణయంతో రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది.నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వారి అభ్యర్థనను తోసిపుచ్చారు.

Read Also:Mulugu Naxal-free: కర్రెగుట్టలను 'నక్సల్ రహిత' ప్రాంతంగా ప్రకటించిన డీజీపీ

Moinabad Drug Case: కోర్టులో వాదనలు

కాగా, గత నెల 14న రాత్రి మెయిన్ బాద్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీని ఈగల్ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ వేదికగా నిషేధిత మత్తు పదార్థాలు వినియోగించారనే ఆరోపణలపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. నిన్నటి విచారణలో ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుల వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు బలంగా వాదించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది.

 Rohith Reddy Drug Case

బెయిల్ పిటిషన్లపై తీర్పునిస్తూ కోర్టు నిందితులకు ఊరట ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు పోలీసు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కూడా కోర్టులో కీలక చర్చ జరిగింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? సరఫరాదారులు ఎవరు? అనే కోణంలో లోతుగా విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఎయిర్‌పోర్టు ను తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha