David Warner Drunken Driving Case: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) డ్రంకెన్ డ్రైవింగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.
ఈస్టర్ సండే పండగ రోజున ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు.
Read Also :One Day World Cup 2027 : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్‌పై కొత్త జట్ల అసంతృప్తి
ఘటన వివరాలు & కోర్టు విచారణ

పోలీసులు నిర్వహించిన శ్వాస విశ్లేషణ (Breathe Analyzer) పరీక్షలో వార్నర్ పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ నిమిత్తం వార్నర్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. డేవిడ్ వార్నర్ మద్యం సేవించి వాహనం నడిపిన విషయాన్ని అంగీకరించినట్లు లాయర్ న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించిన తుది తీర్పును కోర్టు ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.
David Warner Drunken Driving Case: సిడ్నీ థండర్స్ కెప్టెన్సీకి ముప్పు!
ఈ చట్టపరమైన చిక్కుల కారణంగా బిగ్ బాష్ లీగ్ (BBL) లో సిడ్నీ థండర్స్ (Sydney Thunders) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్, తన కెప్టెన్సీ బాధ్యతలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మునుపటి వివాదాల నుంచి బయటపడి కెప్టెన్సీ నిషేధాన్ని తొలగించుకున్న వార్నర్‌కు ఈ ఘటన తీవ్ర ఎదురుదెబ్బగా మారింది.
గంభీర్ వల్లే బ్యాటింగ్ ఆర్డర్ నాశనమైంది: కృష్ణమాచారి శ్రీకాంత్

