Aakasamlo Oka Thara: దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాధినేని దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
విభిన్నమైన కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్‌తో రూపుదిద్దుకున్న ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ సినీ ప్రియులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Jailer 2 Box Office Collections: జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్.. రెండ్రోజుల్లో రూ.209 కోట్లు!
Teaser for Dulquer Salmaan's 'Aakasamlo Oka Tara' released
Aakasamlo Oka Thara: ఆమె కల.. అతడి నమ్మకం.. మనసును హత్తుకునే కథాంశం
చదువుపై ఎంతో మక్కువ ఉన్న ఒక పల్లెటూరి అమ్మాయి, అనంతమైన అంతరిక్షం వైపు సాగించిన అద్భుతమైన ప్రయాణాన్ని ఈ టీజర్‌లో ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. “ఆమె కల.. అతడి నమ్మకం.. ఇది వారిద్దరి ప్రయాణం” అనే క్యాప్షన్ ఈ సినిమా కథలోని లోతును, ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా తీర్చిదిద్దారు.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తుండగా, స్టార్ నటి శృతిహాసన్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన నేపధ్య సంగీతం ఈ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
Epaper: epaper.vaartha.com
బిగ్‌బాస్ హౌస్‌లో మారిన ఓటింగ్ ట్రెండ్స్.. వర్షిణికి ముప్పు ఉందా?

