Dulquer Salmaan New movie: యూత్ ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ఎట్టకేలకు ఖరారైంది.
ఇప్పటివరకు వర్కింగ్ టైటిల్ “DQ41″గా పిలుస్తున్న ఈ చిత్రానికి “శ్రీ శ్రీ” అనే క్లాసిక్ పేరును ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారికంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
కాలేజీ ఫీల్ గుడ్ నేపథ్యంలో రూపొందించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఎంతో తాజాగా, రొమాంటిక్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పోస్టర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై ప్రేమ మళ్లీ చిగురిస్తుంది” (Love Will Spark Again) అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. దీన్ని బట్టి చూస్తే ఇదొక స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
Read Also : Kajal Aggarwal: ఆహార కల్తీతో క్యాన్సర్ ముప్పు.. నటి కాజల్ హెచ్చరిక!
Dulquer Salmaan New movie: తొలిసారి క్రేజీ కాంబినేషన్.. భారీ తారాగణం
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి వెండితెరపై జతకడుతుండటంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, సీనియర్ నటుడు జగపతి బాబు, రమ్యకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి టాలెంటెడ్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ 10వ చిత్రం
ఈ సినిమా ద్వారా రవి నేలకూడిటి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. వైవిధ్యమైన చిత్రాలను నిర్మించే టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి, తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై 10వ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన కొన్ని స్టిల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు విడుదలైన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత స్కై హైకి తీసుకెళ్లాయి.
Title of Dulquer Salmaan’s new movie confirmed as ‘Sri Sri’

