Maharashtra Road Accident: మహారాష్ట్రలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం తెల్లవారుజామున ఒక భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అమరావతి జిల్లా ధామన్‌గావ్ రైల్వే సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న భారీ ట్రక్కు, దుర్గామాత విగ్రహంతో వెళ్తున్న టెంపో బొలెరో పికప్ వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 21 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Minor Girl Rape : మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడికి 51 ఏళ్ల శిక్ష
Truck rams into tempo carrying Goddess Durga idol; seven killed.
Maharashtra Road Accident: నుజ్జునుజ్జయిన పికప్ వ్యాన్
బుల్ధానా జిల్లా షెగావ్ నుంచి దేవీ నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని తీసుకుని భక్తులు పికప్ వాహనంలో వార్ధా వైపు వెళ్తుండగా ఛానల్ నంబర్ 97 వద్ద ఈ విషాదం జరిగింది. ట్రక్ వెనుక నుంచి అత్యంత వేగంతో ఢీకొట్టడంతో పికప్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయి రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న భక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. పండుగ వేళ ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
క్షతగాత్రుల పరిస్థితి విషమం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, హైవే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన ధామన్‌గావ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురైదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవ నిమిత్తం వారిని వార్ధాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న అమరావతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి వాహనాల అతివేగమే కారణమా లేక ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
త్రిశ్శూర్‌లో దారుణం.. ప్రియుడి భార్యతో కలిసి మహిళపై అత్యాచారం

