Ahmedabad bomb blasts : దేశం యావత్తును తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో కింది కోర్టు తీర్పు ను గుజరాత్ హైకోర్టు ఖాయం చేసింది.
38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవితఖైదును ఖాయపరుస్తూ తీర్పు చెప్పింది. సుమారు 70 నిమిషాల వ్యవధిలో అహ్మదా బాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన 21వరుస బాంబు పేలుళ్ల దుర్ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 46 మంది గాయపడ్డారు. భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఉగ్రదాడిగా నిలిచిపోయింది. స్టూడెంట్స్ ఇస్లా మిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ‘సెమి’ మాజీ నాయ కుడు సఫ్టర్ నాగోరి, మరికొందరితో ఏర్పాటు చేసిన ఇండియన్ ముజాహిదిన్ ఈ ప్రేలుడు సంఘటనలకు సూత్రధారులు. కాగా శిక్షపడిన నేరస్థులందరూ హైకోర్టు లో అప్పీల్ చేసుకుని వాదించుకోవడం విశేషం. 2002 గోద్రా అనంతర అల్లర్లకు ప్రతీకారంగానే ఈ ప్రేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. కొందరు నిందితులు సమర్థించుకున్నారు కూడా. వీరిపై దేశ ద్రోహం, ఉగ్రవాద కార్యకలాపాలు, పేలుడు పదార్థాల చట్టం, హత్యాకావించడం వంటి నేరారోపణలపై వారం దరి మీద అహ్మద్ పోలీసులు 35 ప్రాథమిక సమాచార నివేదికలు దాఖలు చేయగా ఒకే మూస కేసులుగా విచా రణ జరిగింది. మొత్తం 78 మంది నిందితులపై విచా రణ జరుగగా 49 మందిని దోషులుగా నిర్ధారించింది. తగిన ఆధారాలు లేవన్న కారణంగా 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఒకరు అప్రూవర్గామారారు.
Ahmedabad bomb blasts
Ahmedabad bomb blasts : 13 ఏళ్లపాటు విచారణ అనంతరం
దాదాపు 13 ఏళ్లపాటు విచారణ అనంతరం అహ్మదాబాద్ ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎ.ఆర్.పటేల్ ఫిబ్రవరి 8, 2022న తీర్పు వెలువరించి అదే నెల 18న శిక్షలు ఖరారు చేశారు. 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఒక ఉగ్ర వాద కేసులో ఇంత పెద్ద సంఖ్యలో ఉరిశిక్షలు విధించ డం భారత న్యాయ చరిత్రలోనే అరుదైన విషయం. 7వేలకు పైగా పేజీల తీర్పులో ప్రస్తావించిన ఎన్నో అంశా లను పరిగణనలోకి తీసుకొని శిక్షలు విధించారు. ఈ కేసులో నిందితులను సభ్యసమాజంలో తిరుగనివ్వడ మంటే మానవ మాంసానికి తహతహలాడే చిరుతను వారిపైకి వదిలి పెట్టినట్లే అవుతుందని కోర్టున్యాయమూర్తి వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవభావం లేని నిందితులు ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయాలనే ఉద్దేశంలోనే ఈ దురాగతానికి పాల్ప డ్డారని కోర్టు అభిప్రాయానికి వచ్చింది. ఇలాంటి నేరా లను అతిసాధారణ నేరాలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కోర్టు అభిప్రాయపడింది.
ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలన్న సంకల్పం
దేశంలో ఉగ్రవాదాన్ని, వాటి ఛాయల్ని తుడిచిపెట్టాలన్న సంక ల్పంతో, ఇతరులకు ఇలాంటి కేసుల్లో శిక్షలే భయపెట్టిం చాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేవలం నిందితులను శిక్షించడం ద్వారా వారిని సత్ప్రవర్తన వైపు మళ్లించాలన్నది న్యాయవ్యవస్థ ప్రధాన సిద్ధాంతం. కానీ అహ్మదాబాద్ ఘోరకలికి బాధ్యులైనవారు క్షమార్హులు కాదనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టంచేస్తోంది. వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న’ న్యాయ సిద్ధాంతం నేపథ్యం లోనే ఈ అంశంపై దోషులను గుర్తించి సిద్ధపడడానికి బాగా సమయం తీసుకోవాల్సి వచ్చింది. సంఘటనకు బాధ్యులుగా భావించి గుర్తించిన నిందితుల్లో 28 మంది నిందితులను కోర్టు నిదానంగా ఒకొఒక్కరి పాత్రను సమీ క్షించింది. ఉగ్రవాదం వంటి అత్యంత హీనమైన కేసుల్లో కేవలం సందేహాల కారణంగా ంగా శిక్ష విధించరాదని కోర్టు అభిప్రాయపడుతూనే బలమైన సాక్ష్యాధారాలుఉన్నవారినే నిందితులుగా నిర్ధారించింది. సుదీర్ఘకాలం సాగిన దర్యాప్తు లో కేసులో ప్రధాన సాక్ష్యాల గుర్తింపు, పేలుడు పదార్థాలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాల్లో దర్యాప్తులో కొన్ని లోపాలున్నాయని ప్రతివాద న్యాయవాదులు ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయినా నిజ మైన నిందితులను గుర్తించడంలో కిందికోర్టు బాగా ప్రయాసపడినట్లే! సాక్ష్యాల సమగ్ర పరిశీలన అనంతరమే నిందితుల పాత్రను నిర్ధారించుకున్న తర్వాతనే వారిపై అభియోగాల ఖరారు, పాత్ర, శిక్షార్హతపై పలు చర్చలు కూడా నడిచాయి.
Ahmedabad bomb blasts
ముష్కరులకు శిక్షలు తప్పవని నేటి తీర్పు
ప్రత్యేక కోర్టులు ఉరిశిక్ష విధిస్తే న్యాయ ప్రక్రియలో హైకోర్టు శిక్షలు ధృవీకరించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు జరిగింది. దీనికి మరో మజిలీ సుప్రీంకోర్టు. ఏ నిరపరాధి శిక్షించబడకూడదు. ఏ అపరాధీ తప్పించ బడకూడదనే న్యాయసూత్రంతో న్యాయప్రక్రియమిళితమై ఉంది. దుస్సంఘటన, దురాగతం ఏ స్థాయిలో ఉన్నా. ఎవరు నిందితులెవరైనా ఏదో ఒకనాడు శిక్షలను అనుభ వించాల్సిందే. ఉగ్రవాదంపై రాజీ ఉండబోదన్న సంకల్పా నికి ప్రతీకగా గుజరాత్ అహ్మదాబాద్ ప్రేలుళ్ల సంఘటన విచారణ చట్టబద్దంగా సాగింది. సాక్ష్యాధారాల సేకరణ, నిందితుల హక్కుల పరిరక్షణ కూడా ఈ కేసులో ప్రధా నంగా పాటించారు. ఇలాంటి ఉదంతాలు జరగకుండా నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని కూడా ఈ సంఘటన గుర్తు చేస్తోంది. ఆనాటి దుర్ఘటనకు బలైన కుటుంబాలకు హైకోర్టు పరి హారాలను ప్రకటించడం మానవతా దృక్పథంతో కూడినదే. విచారణ కాలంలో 9 మంది న్యాయమూర్తుల ముందు 1163 మంది సాక్షులను విచారించగా చివరకు ప్రత్యేక కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు ఆ శిక్షలను సమర్థించడం ఆహ్వానించదగినది. ఆనాటి ఘటనలు ఎంతో అమానుష కృత్యంగా భావించి యావత్తుభారతదేశం తల్లడిల్లిపోయిం ది. జస్టిన్ అల్పేష్ కోగీ, జస్టిస్ సమీర్ జె దవే కూడిన అహ్మదాబాద్ డివిజన్ బెంచి స్పెషల్ కోర్టు తీర్పును కూలంకషంగా పరిశీలించింది. దుష్కృత్యాలు ఏ రూపం లో జరిగినా వాటి వెనుక ఉన్న ముష్కరులకు శిక్షలు తప్పవని నేటి తీర్పు తేటతెల్లం చేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
భారత్ కేంద్రంగా పనిచేసే ముఠాలపై అమెరికా 'ఆపరేషన్ హార్డ్ బాల్'

