Nellore crime:సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాదం. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు.సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని..విచారణ చేపట్టిన పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ కొనసాగింపు
Read allso: PVN Madhav: వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తక్షణమే తొలగించాలి: పీవీఎన్ మాధవ్

నెల్లూరు జిల్లా సంగం ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగం మండలం దువ్వూరు గ్రామంలో రిటైర్డ్ టీచర్ మధు కుటుంబం ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే ఉరి వేసుకుని వారు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

Nellore crime:ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మధు కుటుంబ సభ్యులు ఇలాంటి దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించి అసలు కారణాలు వెలికితీసే పనిలో ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

