AP dwacra loans:డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డ్వాక్రా మహిళలకు రూ.3లక్షల చొప్పున స్త్రీనిధి లోన్ అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
గ్రామాల్లో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Read also: Rayalaseema Horticulture: సీమ రైతులకు ఉద్యాన పంటల సాగుపై సరికొత్త పథకం
Dwakra Women’s Fund Loan of Rs. 3 lakhs
పీఎంఎఫ్‌ఎంఈ పథకంతో స్త్రీనిధి అనుసంధానం
గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని స్త్రీనిధితో జత చేశారు. దీనిద్వారా అర్హత ఉన్న మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారం ప్రారంభించే ప్రతీ మహిళకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి.
AP dwacra loans:వివిధ రకాల చిన్న పరిశ్రమల ఏర్పాటు అవకాశాలు
అందుకున్న ఈ రుణాలతో పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పులు అలాగే మసాలాలు మరియు పచ్చళ్లు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా పిండి పదార్థాలు, రుచికరమైన స్నాక్స్ యూనిట్లను కూడా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత వ్యాపారంతో రాణించవచ్చు.
Epaper: epaper.vaartha.com

