Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏ పాపం తెలియని చిన్నారిని బలి తీసుకున్న బావ!

ఏ పాపం తెలియని చిన్నారిని బలి తీసుకున్న బావ!

వార్త 3 months ago

Anantapur Crime: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం ఏడేళ్ల వయసున్న బాలుడు వేమ్ చంద్రను అతడి సొంత బావ బోయ సర్వేష్ దారుణంగా కొట్టి చంపాడు.

నిన్న సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వస్తున్న బాలుడిని సర్వేష్ కిడ్నాప్ చేసి, సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలుడిని తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు.

Read Also: మార్కాపురం బస్సు ప్రమాదంలో గంట గంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య

Anantapur Crime: అత్తారింటిపై కక్షతో చిన్నారి బలి

ఈ ఘాతుకానికి కారణం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వేమ్ చంద్ర అక్కను వివాహం చేసుకున్న బోయ సర్వేష్, ఉగాది పండుగ సందర్భంగా భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. అయితే, తనకు అత్తమామలు సరైన గౌరవం ఇవ్వడం లేదని, తనను తక్కువ చేసి చూస్తున్నారని భావించిన సర్వేష్ వారిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షను ఎలా తీర్చుకోవాలో అని ఆలోచించి, ఏ పాపం తెలియని చిన్నారి వేమ్ చంద్రను బలి తీసుకున్నాడు.

పోలీసుల దర్యాప్తు వేగవంతం

బాలుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా, అటవీ ప్రాంతంలో వేమ్ చంద్ర మృతదేహం లభ్యమైంది. పోలీసులు నిందితుడు బోయ సర్వేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి దారుణ హత్యతో కోనుప్పలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

దమ్మాయిగూడలో దారుణ హత్య.. పొదల్లో మహిళ మృతదేహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha