Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
E-20 పెట్రోల్ పై మంత్రి పొన్నం స్పష్టత

E-20 పెట్రోల్ పై మంత్రి పొన్నం స్పష్టత

వార్త 3 weeks ago

E-20 petrol vehicles:ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తిగా కొట్టిపారేశారు.

ఈ-20 పెట్రోల్ వాడకం కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఈ కీలక విషయాలు వెల్లడించారు.

Read also: Ration card mistakes: తప్పుల తడకగా మారిన కొత్త రేషన్ కార్డులు

 There is no risk to vehicles from E-20 petrol.

వాహనదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు

దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజిన్లు పాడవుతున్నట్లు వాహన యజమానుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. ఆటోమొబైల్ రంగ నిపుణులు లేదా వినియోగదారుల నుంచి ఎలాంటి ప్రతికూల స్పందన లేనందున దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

E-20 petrol vehicles:నియంత్రణ చర్యలు చేపట్టే ప్రసక్తి లేదు

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేదా నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం రాలేదని మంత్రి పేర్కొన్నారు. తప్పుడు వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. భవిష్యత్తులో కూడా పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తామని మంత్రి వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

తప్పుల తడకగా మారిన కొత్త రేషన్ కార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha