Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ దెబ్బకు రోడ్డు మీదకు 1.23 లక్షలకు పైగా ఉద్యోగులు

ఏఐ దెబ్బకు రోడ్డు మీదకు 1.23 లక్షలకు పైగా ఉద్యోగులు

వార్త 2 weeks ago

Layoffs : ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల కోత (Layoffs) పరంపర తీవ్రరూపం దాల్చింది. 2026 సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం మిగిలి ఉండగానే, గ్లోబల్ టెక్ రంగంలో చోటుచేసుకున్న లేఆఫ్స్ సంఖ్య గత ఏడాది మొత్తం నమోదైన గణాంకాలను దాటేసి ఐటీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

కంపెనీలు తమ మూలధనాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నూతన సాంకేతిక రంగా పరిధిలోకి వేగంగా మళ్లిస్తూ, ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ భారీ శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టాయి.

Read Also: SBI Jobs: ఎస్బీఐలో ఉద్యోగాలు

 Layoffs

Layoffs : Layoffs.fyi తాజా డేటా ప్రకారం.

ఉద్యోగ కోతలను విశ్లేషించే ప్రముఖ అంతర్జాతీయ పోర్టల్. 2025 క్యాలెండర్ ఇయర్ మొత్తం మీద 278 టెక్ కంపెనీలలో 1,22,606 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే 2026లో ఇప్పటివరకు కేవలం 289 టెక్ సంస్థల్లోనే ఏకంగా 1,23,305 మంది టెక్ ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. గతేడాది మొత్తం సంఖ్య కంటే ఈ ఎనిమిది నెలల్లోనే 699 ఉద్యోగ కోతలు అధికంగా జరగడం పరిశ్రమలో మారిన సవాలు వాతావరణానికి అద్దం పడుతోంది. ఈ విడత కోతలలో సిలికాన్ వ్యాలీ గ్లోబల్ టెక్ దిగ్గజాల వాటానే అగ్రస్థానంలో ఉంది. బిలియన్ల డాలర్లను ఏఐ మౌలిక సదుపాయాలపై పెట్టుబడిగా పెడుతున్న ఒరాకిల్ (Oracle) సుమారు 21,000 ఉద్యోగాల కోతతో లేఆఫ్స్ జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. ఒరాకిల్ భారతదేశంలో కూడా సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా 2,000 నుండి 3,000 మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు సేకరించిన నివేదికలు సూచిస్తున్నాయి.

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha