Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎఐలోను 'మహిళా హక్కులు' అవసరం

ఎఐలోను 'మహిళా హక్కులు' అవసరం

వార్త 2 weeks ago

Artificial intelligence : ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) గురించే చర్చ జరుగుతోంది. మనుషుల పనిభారాన్ని తగ్గిస్తూ, అద్భుతాలు సృష్టిస్తోందని కొనియా డబడుతున్న ఈ కృత్రిమ మేధస్సు, అంతర్లీనంగా ఒక ప్రమాదకరమైన జాడ్యాన్ని కూడా తనలో దాచుకుంటోంది.

అదే ‘లింగ వివక్ష. ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్) మహిళా విభాగం విడుదల చేసిన ఒక నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. లేడీస్ అంటే ఎఐకి అలుసు’ అనే పచ్చి నిజాన్ని ఈ నివేదిక సమాజం ముందు పెట్టింది. అయితే ఈ వివక్షకు, సమాధానాల్లో దొర్లేతప్పులకు సాంకే తిక పరిభాషలో చెప్పుకునే ఎలాంటి ‘బగ్’ కారణం కాకపో వడమే ఇక్కడ అసలు ట్విస్ట్. ఎఐ అనేది ఒక ఖాళీ కాగితం లాంటిది. దానికి సొంతంగా ఆలోచించే హృదయమో, నైతికతతో కూడిన మేధస్సో ఉండవు. ఇంటర్నెట్లో దశాబ్దా లుగా అందుబాటులో ఉన్నకోట్లాది మానవ సంభాషణలు, పుస్తకాలు, వార్తలు, సమాచారాన్ని విశ్లేషించి అది సమా ధానాలు నేర్చుకుంటుంది. అంటే, మన సమాజంలో శతా బ్దాలుగా వేరూనుకుపోయిన పితృస్వామ్య పోకడలను, స్త్రీల పై ఉన్న పక్షపాతాలను, మూస పద్ధతులను ఎఐ తన గురువులైన మనుషుల నుంచే నేర్చుకుంది. మనుషుల అవలక్షణాలు, పక్షపాతాలే ఎఐకి పాఠాలుగా మారాయి. ఐక్యరాజ్యసమితి పరిశోధనల ప్రకారం.. అధ్యయనంచేసిన ఎఐ వ్యవస్థల్లో 44 శాతం వ్యవస్థలు తీవ్రమైన లింగ వివ క్షను. 25 శాతం కంటే ఎక్కువ వ్యవస్థలు లింగ, జాతి వివక్షను స్పష్టంగా ప్రదర్శించడమే దీనికి నిదర్శనం,

 artificial intelligence

artificial intelligence : లింగ వివక్ష

వివిధ సందర్భాలలో ఎఐ ఇచ్చిన సమాధానాలను పరిశీలిస్తే స్త్రీల పై దానికి ఉన్న చులకనభావం, అలుసు స్పష్టంగా అర్థమ వుతుంది. సాధారణ వాక్యాలను పూర్తి చేయమని ఎఐని అడిగినప్పుడు, అది పురుషులను వ్యా పాఠాలు, నాయకత్వం, వృత్తిపరమైన విజయాలతో ముద్ద పెట్టింది. అదే సమ యంలో స్త్రీలను ఇల్లు, వంటగది, కుటుంబం, పిల్లల సంరక్షణకే పరిమితం చేస్తూ సమాధా నాలిచ్చింది. కొన్ని ప్రత్యేకనందర్భాల్లో స్త్రీలను స్వతంత్ర వ్యక్తులుగాకాకుండా, కేవలం ఆస్తిగా లేదా పురుషులకు లోబడిన లైంగిక వస్తు వులుగా చిత్రీకరించేలా ఎఐ ప్రవర్తించింది. ఇందులో ప్రతి ఐదు సమాధానాలలో ఒకటి లింగ వివక్ష లేదా స్త్రీ వ్యతి రేకతతో కూడి ఉండటం గమనార్హం. ఇంతటితో ఆగకుండా, ఇంటర్నెట్ వేదికగా మహిళలపై జరిగే హింసకు, వేధింపు లకు కూడా ఎఐ ఒక సాధనంగా మారుతోంది. మహిళా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులలో నలుగురిలో ఒకరు ఎఐ సహాయంతో ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటుండటం ఆందోళనకరం. మహి కల అనుమతి లేకుండా వారి ముఖాల ను మార్చేసి ‘డీప్పేక్’ ఆశ్లీలచిత్రాలు, వీడియోలు సృష్టించ డానికి ఎఐని వాడుతూ డిజిటల్ ప్రపంచంలో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు ఇమెయిళ్లు రాయడానికి, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయడానికి, కంటెంట్ సృష్టించడానికి నిత్యం ఎఐని వాడుతున్న తరు ణంలో, అది ఇలాంటి వివక్షతో కూడిన సమాధానాలుఇస్తూ పోతే సమాజంలో లింగ వివక్ష మరింత బలపడేప్రమాదం ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి హెచ్చరించినట్లుగా.. మానవ మేధస్సును భర్తీ చేయడం కంటే, మానవులదుర్మా ర్గాలు, పక్షపాతాలు, వివక్షలను ఎఐ వారసత్వంగా తీసు కోకుండా చూడటమే ప్రస్తుతం మానవాళి ముందున్న అతి పెద్ద సవాలు. ఎఐ అభివృద్ధి దశ నుండి దాని వినియోగం వరకు ప్రతి చోటా లింగ సమానత్వాన్ని, మహిళల హక్కు లను జోడించాల్సిన అవసరం ఉంది. ఎఐకి కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ‘సమానత్వం’ అనే పాఠం కూడా నేర్పి నప్పుడే అది నిజమైన ప్రగతికి బాటలు వేస్తుంది.

-మర్రావు వసుంధరా దేవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

బాబాయ్ పెట్రోల్ కోసం 18 గంటలు లైనులోనే..ఎక్కడంటే..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha