CM Revanth Reddy On Disciplinary Actions : తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయ వేడి పెరిగింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఏఐసీసీ (AICC) పెద్దల సమక్షానికి చేరింది.
ఈ వివాదంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో సీఎం ఇప్పటికే చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సీఎం భేటీ అవుతారు. కొండా సురేఖ మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్చలు జరపనున్నారు. వీరిద్దరిపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేబినెట్ విస్తరణకు కొంత సమయం పట్టినా కొండా సురేఖ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సమాచారం. ఈ పర్యటనలోనే పలువురు మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపై స్పష్టత రానుంది.
CM Revanth Reddy On Disciplinary Actions
CM Revanth Reddy On Disciplinary Actions : కేంద్ర మంత్రులతో సీఎం కీలక సమావేశాలు - ఇన్వెస్ట్ తెలంగాణ
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను, వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలవనున్నారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సులో డి

