Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EB-2, EB-5 వీసాలు నిలిపివేత!.. భారతీయులకు తీవ్ర నిరాశే!

EB-2, EB-5 వీసాలు నిలిపివేత!.. భారతీయులకు తీవ్ర నిరాశే!

వార్త 2 weeks ago

US EB-2, EB-5 Visa : అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ జూలై 2026 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. భారతీయ దరఖాస్తుదారులకు ఈసారి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

ముఖ్యంగా ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ సెకండ్ ప్రిఫరెన్స్ (EB-2), EB-5 అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల్లో వీసాలు ప్రస్తుతం అందుబాటులో లేవు (Unavailable). దీనివల్ల ఈ వేసవిలో తమ గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీసాలు ‘అన్‌అవైలబుల్’గా మారాయంటే.. ఈ ఏడాదికి కేటాయించిన వీసా కోటా పూర్తయిందని అర్థం. EB-2 కేటగిరీలోని భారతీయ నిపుణులకు జూలైలో ఎటువంటి ఫైనల్ యాక్షన్ డేట్స్ లేవు. అలాగే EB-5 అన్‌రిజర్వ్‌డ్ విభాగంలోనూ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. మళ్లీ అక్టోబర్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై, కోటా రీసెట్ అయ్యే వరకు దరఖాస్తుదారులు వేచి చూడాల్సిందే. అంతర్జాతీయ ప్రయాణాలు లేదా స్టేటస్ మార్పులు ప్లాన్ చేసుకునే వారు ఈ నెలవారీ మార్పులను గమనించడం చాలా ముఖ్యం.

Read Also: Maruti suzuki: 35 కిలోమీటర్ల మైలేజీతో మారుతి కొత్త కార్ల హంగామా

 US EB-2, EB-5 Visa

US EB-2, EB-5 Visa : EB-1 ఇండియాపై ప్రభావం.

జూలై 2026 వీసా బులెటిన్ అప్‌డేట్స్ భారతీయులకు సంబంధించి EB-1 కేటగిరీలోనూ నిరాశే ఎదురైంది. ఈ విభాగంలో ఫైనల్ యాక్షన్ డేట్ వెనక్కి వెళ్ళింది . మేనేజర్లు, రీసెర్చర్ల నుంచి డిమాండ్ భారీగా పెరగడమే ఈ వెనకడుగుకు కారణం. అయితే, F1 ఫ్యామిలీ కేటగిరీలో మాత్రం స్వల్ప పురోగతి కనిపించింది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ఫ్యామిలీ కేటగిరీల్లో కదలికలు ఉంటే, ప్రాసెసింగ్ ప్రాధాన్యతలు మారుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ‘ఫైనల్ యాక్షన్ డేట్స్’, ‘డేట్స్ ఫర్ ఫైలింగ్’ మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రస్తుతం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తన చార్ట్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసిన ఎన్‌టీఏ.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha