Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏడేళ్ల కిందటి శివకుమర్ శపథం.. !

ఏడేళ్ల కిందటి శివకుమర్ శపథం.. !

వార్త 2 weeks ago

DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న అధికార మార్పిడి ఎట్టకేలకు ఖరారైంది. జూన్ 3న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DKS) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గత కొంతకాలంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సాగిన అధికార పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఏడేళ్ల కిందట ఆయన చేసిన ఒక సంచలన శపథం ఇప్పుడు కన్నడ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేతిలో అరెస్టయిన డీకే శివకుమార్, సుమారు 50 రోజుల పాటు దిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో కాకుండా, దట్టమైన గడ్డంతో బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే వరకు ముఖంపై బ్లేడు వేయనని, గడ్డం గీసుకోనని ఆ రోజే ఆయన బలమైన ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఆ కల సాకారం కానుండటంతో ఆయన శపథం నెరవేరినట్లయింది.

Read Also : చండీగఢ్ MCh రెటినా ఎంట్రన్స్‌లో డాక్టర్ ఆశిష్‌కి 'ఆల్ ఇండియా టాప్ ర్యాంక్'!

క్లీన్ షేవ్‌తో కనిపిస్తారా? కన్నడనాట ఆసక్తికర చర్చ!

రాజకీయాల్లో 'కనకపుర బండే' (కనకపుర రాయి)గా పిలవబడే డీకే శివకుమార్, జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ గడ్డాన్ని తన రాజకీయ పోరాటానికి ఒక చిహ్నంగా మార్చుకున్నారు. అప్పట్లో రాహుల్ గాంధీ కూడా ఆ గడ్డం ఆయన రాజకీయ తుఫానును తట్టుకుని నిలబడిన నాయకుడిగా చూపిస్తుందని, అలాగే ఉంచాలని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఏళ్ల తరబడి పెంచిన ఆ గడ్డంతోనే ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో, డీకే శివకుమార్ తన ఏడేళ్ల నాటి శపథాన్ని పూర్తి చేసుకుని, మళ్లీ తన పాత లుక్ అయిన “క్లీన్ షేవ్”తో వేదికపై కనిపిస్తారా? లేదా అదే గడ్డంతో ప్రమాణ స్వీకారం చేస్తారా? అనే ఉత్కంఠ అటు అభిమానుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో విపరీతంగా పెరిగిపోయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని సూచనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha