World Emoji Day 2026: నేటి ఆధునిక డిజిటల్ యుగంలో చాటింగ్ చేసేటప్పుడు ఒక్క ఎమోజీ (Emoji) పంపితే చాలు.. వంద పదాలతో చెప్పలేని భావాన్ని క్షణాల్లో వ్యక్తపరచవచ్చు.
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో మన దైనందిన సంభాషణల్లో భాగమైపోయిన ఈ బుజ్జి డిజిటల్ చిహ్నాల ప్రాధాన్యతను గుర్తిస్తూ ఏటా జులై 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ ఎమోజీ డే’ (World Emoji Day) జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజును ప్రముఖ ఎమోజీ డేటాబేస్ వెబ్‌సైట్ ‘ఎమోజీపీడియా’ (Emojipedia) వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్ (Jeremy Burge) ప్రారంభించారు.
1980ల నాటి ‘ఎమోటికాన్’ల నుండి నేటి ఎమోజీల వరకు
డిజిటల్ భాషకు సరికొత్త రూపునిచ్చిన ఎమోజీల ప్రస్థానం వెనుక మూడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర దాగి ఉంది.
- తొలి అడుగులు: 1980వ దశకంలో కంప్యూటర్ శాస్త్రవేత్త స్కాట్ ఫాల్మన్.. సాధారణ టెక్స్ట్ క్యారెక్టర్లను ఉపయోగించి రూపొందించిన సంతోషకరమైన :-) మరియు విచారకరమైన :-( గుర్తులను కమ్యూనికేషన్‌లో వాడాలని ప్రతిపాదించారు. వీటిని ‘ఎమోటికాన్లు’ (Emoticons) అని పిలిచేవారు.
- జపాన్‌లో డిజైన్: 1999లో జపాన్‌కు చెందిన ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం ఒక డిజైనర్ మొట్టమొదటి ఎమోజీ సెట్‌ను రూపొందించడంతో వీటికి అధికారిక రూపం లభించింది.
- యూనికోడ్ గుర్తింపు: గూగుల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంటర్నేషనలైజేషన్ టీమ్ 2007లో అంతర్జాతీయ టెక్స్ట్ ప్రమాణాలను పర్యవేక్షించే ‘యూనికోడ్ కన్సార్టియం’కు ఒక విజ్ఞప్తి చేసింది. కంప్యూటర్లు, ఫోన్లలో ఎమోజీలను ప్రామాణికంగా గుర్తించాలని కోరడంతో ఎమోజీల రూపురేఖలు మారిపోయాయి.
- యాపిల్ కీబోర్డ్ విప్లవం: 2011లో యాపిల్ (Apple) తన ఐఓఎస్ (iOS) ఆపరేటింగ్ సిస్టమ్‌లో అధికారికంగా ఎమోజీ కీబోర్డ్‌ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత గ్లోబల్ ఆండ్రాయిడ్ మార్కెట్లోకి ఇవి వేగంగా విస్తరించాయి.

World Emoji Day 2026: ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న టాప్ ఎమోజీలు
కాలక్రమేణా ఎమోజీలు కేవలం ముఖ కవళికలకే పరిమితం కాకుండా విభిన్న సంస్కృతులు, వివిధ రకాల చర్మ రంగులు (Skin Tones), విభిన్న కుటుంబ నిర్మాణాలు, జంతువులు, ఆహార పదార్థాలు, ఆటలు మరియు వివిధ దేశాల జాతీయ జెండాల రూపంలోకి విస్తరించాయి. ప్రస్తుతం డిజిటల్ చాటింగ్‌లో వేల సంఖ్యలో ఎమోజీలు అందుబాటులో ఉండగా.. వీటిలో రెడ్ హార్ట్ (Heart
), ఫైర్ (Fire
), గట్టిగా ఏడుస్తున్న ముఖం (Loudly Crying Face
) వంటి ఎమోజీలు గ్లోబల్ చాటింగ్‌లో అత్యధికంగా వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవి టెక్స్ట్ సందేశాలను మరింత ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Epaper: epaper.vaartha.com

