Shivraj Singh Chouhan: ఈ ఏడాది ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌పై 'ఎల్‌నినో' (El Nino) తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
దేశంలోని దాదాపు 9 నుంచి 10 రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో సవాలును తిప్పికొట్టేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.
Read Also : Modi and Meloni:మనం ఇన్‌స్టాలో చాలా ఫేమస్..ఫ్రాన్స్ వేదికగా మోదీ-మెలోనీ క్రేజీ మీమ్స్!
El Niño to impact 10 states this year; Centre issues key guidelines for farmers!
Shivraj Singh Chouhan: పత్తి, పప్పుధాన్యాల సాగుపై ఫోకస్
ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలను ముందే గుర్తించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల కోసం ప్రత్యేక ముందస్తు అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. తక్కువ నీటితో పండే, ప్రత్యామ్నాయ పంటలైన పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని ఈ సీజన్‌లో గణనీయంగా పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా రైతులకు నష్టం కలగకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు.
రైతుల్లో భయాలు వద్దు.. శాస్త్రీయ సలహాలు అందించడమే ముఖ్యం!
వాతావరణ మార్పుల నేపథ్యంలో అన్నదాతల్లో ఎలాంటి భయాందోళనలు సృష్టించవద్దని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతులను కంగారు పెట్టడం మన లక్ష్యం కాదు. వారికి ఎప్పటికప్పుడు కచ్చితమైన, శాస్త్రీయ ఆధారిత సలహాలు అందేలా చూడటమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం” అని ఆయన నొక్కి చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ సమయంలో ఎలాంటి వ్యవసాయ పద్ధతులు పాటించాలో క్షేత్రస్థాయిలో రైతులకు వివరించేలా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలన్నారు.
దేశంలో ఎరువుల కొరత ఎక్కడా రాకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా, దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు సైతం ఎరువుల ముందస్తు సరఫరా సకాలంలో అందేలా గట్టి నిఘా ఉంచాలని, రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు ఉద్ధవ్ సేన లేఖ

