Manthena Ramaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మౌలిక సదుపాయాల రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
మహానాడు-2026 వేదికగా రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన కీలక రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించింది. రెండో రోజు సదస్సులో భాగంగా ‘రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, అమరావతి అభివృద్ధి’పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఏపీఐఐసీ (APIIC) ఛైర్మన్ మంతెన రామరాజు కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో బహుళార్ధసాధక ప్రాజెక్టుల పనులు వేగవంతం అయ్యాయని ఆయన వెల్లడించారు.
ap mahanadu 2026
2026 ముగిసేలోగా మూడు భారీ పోర్టులు ప్రారంభం!
రాష్ట్ర ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా తీరప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంతెన రామరాజు తెలిపారు. ఇందులో భాగంగానే నిర్దేశిత గడువు కంటే ముందే ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది చివరకు ప్రారంభం: మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణ పనులను వేగవంతం చేశామని, 2026 చివరి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.
కాకినాడ గేట్‌వే పోర్టు: ఈ ప్రతిష్టాత్మక పోర్టును 2028 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి తీరప్రాంత వాణిజ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తామని వివరించారు.
సీఎం చంద్రబాబు సంకల్పం: ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఉండేలా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ప్రధాన ఆశయమని రామరాజు పేర్కొన్నారు.
Read also: AP Noise Pollution: ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!
Manthena Ramaraju: దుగరాజపట్నంలో రూ.29,253 కోట్లతో మెగా క్లస్టర్
నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ పోర్టుతో పాటు, అత్యాధునిక ‘మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్ వెల్లడించారు. సుమారు రూ.29,253 కోట్ల భారీ అంచనా వ్యయంతో రాబోతున్న ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
విమానయాన రంగంలో సరికొత్త రికార్డులు: భోగాపురం సహా 9 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు
రాష్ట్రంలో కనెక్టివిటీని పెంచేందుకు విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు రామరాజు తెలిపారు. గతంలో మాన్సాస్ ట్రస్ట్ భూముల సమస్యలను చంద్రబాబు చొరవతోనే పరిష్కరించామని గుర్తుచేశారు. భోగాపురాన్ని కేవలం ఎయిర్‌పోర్టుగా మాత్రమే కాకుండా ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎడ్యుకేషన్ హబ్‌గా బహుముఖంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మరో 9 కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు విమానాశ్రయ పనులను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో టెండర్ల దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.
జగన్ తుగ్లక్ విధానాల వల్లే ఏపీ వెనుకబడింది: మంతెన రామరాజు ధ్వజం
గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీఐఐసీ ఛైర్మన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు పారిపోయాయని ఆరోపించారు.
“గత ఐదేళ్లలో పోర్టులు, మౌలిక వసతుల పనులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను చంద్రబాబు ప్రతిపాదిస్తే.. ‘అక్కడకు ఎర్రబస్సే గతి’ అని ఎగతాళి చేసిన వైసీపీ నేతలు, ఈరోజు తామే దాన్ని కట్టామంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు” అని రామరాజు మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన ప్రాజెక్టులన్నింటినీ పునఃప్రారంభించిందని, ‘విజన్-2047’ లక్ష్య సాధనలో భాగంగా పర్యాటక రంగంతో పాటు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

