Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ నెల 16న మేడారంలో 'చేయూత' పెన్షన్ల పంపిణీ.. మంత్రి సీతక్క

ఈ నెల 16న మేడారంలో 'చేయూత' పెన్షన్ల పంపిణీ.. మంత్రి సీతక్క

వార్త 1 week ago

Cheyutha Pensions in Medaram: ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారం వేదికగా ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'చేయూత' పింఛన్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీ ప్రక్రియను అధికారికంగా షురూ చేయనున్నారు.

Read Also : Vegetable prices: జేబుకు చిల్లుపెడుతున్న ఉల్లి, వెల్లుల్లి ధరలు

 ‘Cheyutha’ pension distribution in Medaram on the 16th of this month: Minister Seethakka

Cheyutha Pensions in Medaram: రూ.16వేల కోట్ల హ్యామ్ రోడ్ల పైలాన్, నూతన కలెక్టరేట్ ఆవిష్కరణ

పింఛన్ల ప్రారంభోత్సవంతో పాటు ములుగు జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. రూ.16వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ‘హ్యామ్’ (HAM) రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు, ములుగు జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అందించనున్న పింఛన్లలో ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

నగరవాసులకు గుడ్ న్యూస్ ..సౌత్ హైదరాబాద్‌లో తగ్గనున్న ట్రాఫిక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha