Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ నెల 30న ఖాతాల్లోకి PM కిసాన్ నిధులు

ఈ నెల 30న ఖాతాల్లోకి PM కిసాన్ నిధులు

వార్త 0 months ago

PM KISAN : దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం 24వ విడత నిధులు అక్టోబర్ 30న విడుదల కానున్నట్లు సమాచారం.

ఈ విడతలో సుమారు 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం మూడు విడతల్లో అందుతుంది. ప్రతి విడతలో రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. వ్యవసాయ పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులు వంటి అవసరాల కోసం రైతులకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుంది.

ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే నిధుల జమ

పీఎం కిసాన్ పథకం ద్వారా నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ఆధార్ వివరాలు బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. భూమి రికార్డుల ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్నా, ఇతర వివరాల్లో లోపాలున్నా నిధుల జమ ఆలస్యం కావచ్చు. రైతులు తమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలోని 'Know Your Status' ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. అక్కడ అవసరమైన వివరాలను నమోదు చేసి చెల్లింపు స్థితి, ఈ-కేవైసీ వివరాలు తదితర అంశాలను పరిశీలించవచ్చు. నిధులు సకాలంలో అందాలంటే రైతులు తమ వివరాలను ముందుగానే సరిచూసుకోవడం మంచిది.

11,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha