Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ పంథా ఏ 'మార్పు' కోసం!

ఈ పంథా ఏ 'మార్పు' కోసం!

వార్త 2 months ago

Annamalai :మా వ్యూహాలకు మేమే రాజులం. వ్యూహం చేశామంటే అవి పండి తీరాలంతే! అని ఎవరేనా అనుకుంటే వాళ్లు పప్పులో కాలేసినట్లే! ఎవరు వ్యూహం చేశారని అల నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఆంధ్రప్రదేశ్ పీఠమెక్కగలిగారు.

ఎవరి ప్రోత్సాహంతో ద్రవిడ నాట సినీ కథానాయకుడు దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీతో ప్రజల్లోకొచ్చి ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల పాలనకు తెరదీసే అవకాశమిచ్చారు. అదంతా ప్రజల చలువ వల్లనే. అదే దారిలో, అదే పోకడలో ద్రవిడ నాట రాజకీయాలు నడపాలన్న ధోరణిలో తమిళ నాడు మాజీ బిజెపి నేత అన్నామలై మరోసారి నడుం బిగించారు. తాను తమిళనాడు బిజెపి అధ్యక్షునిగా ఉన్నంతకాలం అక్కడ రాజకీయాల్లో కొత్త బాటలు వేసేం దుకు బిజెపి అధిష్టానం సహకారం పూర్తిస్థాయిలో దక్కలేదని ఆయనే స్వయంగా చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లోనైనా ద్రవిడ పార్టీలను దాటి విజయ పథంలోకి అడుగుపెట్టాలన్న ఆయన ప్రయత్నాలకు బిజెపి కలిసి రాలేదు.

Read Also : CM DK Shivakumar : సగం తిన్న యాపిల్స్ జనాల్లోకి విసిరిన సీఎం డీకే శివకుమార్ పై తీవ్ర విమర్శలు


Annamalai

Annamalai : రాజకీయ కలకలం

తమిళనాట ద్రవిడ పార్టీల అనుబంధం నుంచి బయటికొచ్చే ప్రయత్నమేవీ చేయకపోగా అన్నాడిఎంకెలో కలిసి సాగడంతో అన్నామలై కాస్త పక్కకు జరిగి మౌనంగా, దూరంగా జరిగి ఉండిపోయారు. ఎన్నికల ముందూ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఆనక ఓటమి చెందితే మరో ఎన్నికకు సిద్ధం కావడం మామూలుగా ఏ రాజకీయ పార్టీయేనా చేసే పని. కానీ ఒక్కసారిగా ద్రావిడనాట ద్రవిడ నేపథ్యం, భావజాలం ఉన్న పార్టీలు చతికిలపడిపోవడం, సంప్రదాయేతర పార్టీతో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడక్కడ రాజకీయ కలకలం చోటు చేసుకొంది. ఇవే సమీకరణలతో ఐదేళ్ల పాటు పార్టీలు నడుపుకోవడం, ప్రజాబాహుళ్యంలోకి వెళ్లి మనుగడ సాధించడమూ కష్టమే. పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అయితే ఐదేళ్లు వేచి ఉండాలా? పదేళ్లు వేచి ఉండాలా అనే విషయమై స్పష్టత లేని తమిళనాడు రాజకీయాలను ఎవరూ నమ్ముకునే పరిస్థితి లేదు. పార్టీల్లో ద్వితీయశ్రేణి నేతలు అటూ ఇటూ చెల్లాచెదుర వుతున్నాయి. ప్రథమ శ్రేణి నాయకత్వం కూడా పక్క చూపులు చూస్తున్నాయి. ఎంత వేచి చూసినా కను చూపు మేరలో భవిష్యత్ ఆశాజనకం లేదని ఎంచి మాజీ మంత్రులు అధికార పార్టీలో చేరిపోతున్నారు. అన్నాడిఎంకె నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఎక్కువ కాలం అధికారంలో లేకుండా ఉండేట్లు లేరు. ఎమ్మెల్యేగా గెలిచిన వారు సైతం బేషరతుగా టి.వి.కె. పార్టీలోకి చేరిపోతున్నారు.

‘మారుదాం. మార్చుదాం’

టివికె అధినేత ముఖ్యమంత్రి పూర్తి మెజారిటీకి అతితక్కువ దూరంలో ఉన్నందున చాలా మంది దానిని అందిపుచ్చుకుంటే తృణమోప్రణమో ప్రజా సేవలో ఉన్నట్లుగా ఉంటుంది. మర్యాద దక్కించు కున్నట్లూ ఉంటుంది అనుకుంటూ జంప్లు చేసేస్తు న్నారు. ఐపిఎస్ ఉ ద్యోగంచేస్తూ సమాజంలో మార్పుకోసం తన వంతుగా రాజీనామా చేసి రాజకీయ జపం చేసిన అన్నామలై కిందపడ్డా మళ్లీ తన ప్రయత్నాలను, ఆలోచ నలను వీడలేదు. ఎప్పుడైతే భారతీయ జనతాపార్టీవదిలి సరికొత్త రాజకీయ ప్రయాణానికి అడుగులువేశారు. ‘వుయ్ ది పీపుల్ పేరిట రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించా రు. స్పందన అనూహ్యం. త్వరలో ప్రజలే కేంద్రంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించే పనిలో పడ్డారు. ‘మారుదాం. మార్చుదాం’ అనే నినాదంతో కొత్త రాజకీయ ప్రస్థానానికి నాంది పలికారు. ‘నా మార్గం వేరు, నా లక్ష్యాలు విస్తృ తం. తమిళనాట ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, సమున్నతమైన మార్పును తీసుకురావాలనుంది అని అన్నామలై స్పష్టం చేశారు. ఎవరెన్ని రాజకీయాలు చేసి నా, రాజకీయ పార్టీ లకు అంతిమ లక్ష్యం అధికారమే. ఒక ఉద్యమానికి పునాది వేస్తే ‘మార్పు’ అదే వస్తుందన్న ఆలోచనలతో ఆయన వ్యూహాన్నినిర్మిస్తున్నారు. ఇటీవల తమిళ తంబి లో వచ్చిన మార్పు సినీ నటుడి పార్టీకి అధికారం కట్ట బెట్టిన తీరు చూస్తే ‘మళ్లీ ఇంకేంకావాలి’ అని ఎవరైనా ప్రశ్నిస్తే, అన్నామలై తన గమ్యానికి సరైన దారి వేసుకునే పనిలో ఉన్నారు.


Annamalai

కొత్తగా రాజకీయాన్వే షణ

తమిళనాడు రాజకీయా ల్లో కాకావికలైన అన్ని పార్టీలు తమ రాజకీయమార్గాన్ని, రాజీ మార్గాన్ని కొత్త పుంతలు తొక్కించే
ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఉద్యమంలా బయటికొచ్చి ఆపైన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. తమిళునిగా కొనసాగుతూ బిజెపిలో ఉండ డం కష్టమైన పనిగా భావించిన అన్నామలై కొత్త పంథా లోకి అడుగు పెట్టారన్న మాట. కొత్తగా రాజకీయాన్వే షణ చేసే వారికి రాజకీయాలు నేర్పేందుకు సన్నద్ధమయ్యారు. కోయంబత్తూరులో ఎపిజె అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతు న్నాయి. రాజకీయ నేతలు కొత్తగా పార్టీ పెట్టే సమయం లో చెప్పేమాటలే ఆయనా చెప్పారు. తమిళనాట రాజ కీయ కూటముల్లో మిత్రులెవరూ ఆనందంగాలేరు. బయ టికెళ్లి అధికార పార్టీలో మమేకమైపోయినా లోపలుండి చేసేదేమీ లేదని తదుపరి కార్యాచరణకు సందిగ్ధంలో ఉన్నారు. నెమ్మదిగా తమకున్న రాజకీయ అనుబంధాలను తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో చితికిపోయిన వారు సైతం ఏంచేయాలో తోచక, నలుగురులో నవ్వులపాలవకుండా ఉండేందుకు కొత్తగా ఉద్య మాలు నిర్మిస్తామంటున్నారు. ఇదిలాఉండగా సూపర్ స్టార్ విజయకాంత్సతీమణి, సామాజిక కార్యకర్త ప్రేమాలతా రజినీకాంత్ ఎండిఎంకె తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ద్రవిడ పార్టీల కూటమిలో ఉండిపోవడం తో తమిళనాడు రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధి కోసం ‘నినాదంతో మక్కల్ మేడ్రై’ పేరిట సామాజిక ఉద్యమానికిపిలు పునిచ్చారు. ఆరాష్ట్రంలో రాజకీయ సామాజికపరిణామాలు ఎంతో మందికి ఎన్నో కొత్తదారులు చూపిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

టీఎంసీలో తీవ్రమవుతున్న అంతర్గత కుమ్ములాటలు: 20 మంది ఎంపీల మద్దతు ఉందంటూ ప్రచారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha