Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన రహానే..

ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన రహానే..

వార్త 4 days ago

MI vs KKR live Score : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఘనవిజయం సాధించిన కోల్‌కతా.. అదే ఊపును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

హార్దిక్, సూర్యకుమార్ రీఎంట్రీ

మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టులోకి రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి వచ్చారు. గత మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో పంజాబ్ కింగ్స్‌పై ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాన్ని (10వ స్థానం) తప్పించుకోవాలని ముంబై భావిస్తోంది. కాగా, కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిట్‌నెస్ సమస్యతో ఇబ్బంది పడుతుండటం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఒకింత కలవరపెడుతోంది.

Read also : India vs Afghanistan 2026:ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు జట్లను ప్రకటించిన BCCI

 MI vs KKR live Score

తుది జట్లు (అంచనా):

  • కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి.
  • ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లఖ్‌నవూపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha