Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈడీకి 'సూపర్ కాప్' అధికారాలు లేవు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

ఈడీకి 'సూపర్ కాప్' అధికారాలు లేవు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

వార్త 2 weeks ago

ED: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాల పరిధిపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైమరీ క్రైమ్ లేకుండా ఈడీ స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టి డబ్బు అక్రమ చలామణి కేసులను నమోదు చేయలేదని స్పష్టం చేసింది.

తన దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని దర్యాప్తు చేయడానికి ఈడీ ఏమీ “సూపర్ కాప్” కాదని వ్యాఖ్యానించింది.

Rajnath Singh : సైనికులతో రక్షణ మంత్రి ప్రత్యేక దీపావళి.. వెల్లువెత్తిన ఉత్సాహం!

ప్రైమరీ క్రైమ్ ఉంటేనే ఈడీ దర్యాప్తు: కోర్టు స్పష్టీకరణ

పిఎమ్‌ఎల్‌ఎ చట్టం కింద ఈడీకి లభించే అధికారాలు “ఉత్పన్నమైనవి” మాత్రమేనని, కానీ “స్వతంత్రమైనవి (original)” కాదని జస్టిస్ ఎం.ఐ. అరుణ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక ప్రాథమిక చట్ట అమలు సంస్థ (పోలీసులు లేదా ఇతర అధికారులు) షెడ్యూల్డ్ నేరంపై ఎఫ్‌ఐఆర్ లేదా అధికారిక ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత మాత్రమే ఈడీ రంగంలోకి దిగడానికి వీలుంటుందని కోర్టు పేర్కొంది. కేవలం అనుమానంతో ఈడీ సొంతంగా (‘సుమోటో’గా) దర్యాప్తును ప్రారంభించలేదని తెలిపింది.

పిటిషనర్లకు ఊరట, ఈసిఐఆర్ రద్దు

కోలార్-చిక్కబళ్లాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం లిమిటెడ్ ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కే వై నంజేగౌడ మరియు ఇతర పిటిషనర్లకు హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఈడీ నమోదు చేసిన ఈసిఐఆర్ తో పాటు దాని ఆధారంగా సాగిన తదుపరి చర్యలను, అలాగే ఈడీ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును న్యాయస్థానం కొట్టివేసింది.

అంతేకాకుండా, పిఎమ్‌ఎల్‌ఎ అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఆస్తుల జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ, సీజ్ చేసిన వస్తువులను యజమానులకు తిరిగి అప్పగించాలని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ మయాంక్ జైన్ వాదనలు వినిపించారు.

ప్రాథమిక కేసు క్లోజ్ అయితే ఈడీ చర్యలు చెల్లవు

ప్రధానమైన (షెడ్యూల్డ్) నేరానికి సంబంధించిన కేసు క్లోజ్ అయినా లేక రద్దయినా, లేదా విచారణ నుండి నిందితుడు విముక్తి పొందినా… దాని ఆధారంగా నడిచే మనీ లాండరింగ్ కేసులు కూడా చెల్లకుండా పోతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణకు కావాల్సిన అనుమతి లభించకపోవడంతో భూ కుంభకోణం కేసు ముగిసిపోయిందని, ఆ క్లోజర్ ఫైనల్ అయినందున, దాని ఆధారంగా ఈడీ విచారణను కొనసాగించడం చట్టబద్ధం కాదని కోర్టు తీర్పు ఇచ్చింది.

పిఎమ్‌ఎల్‌ఎ సెక్షన్ 66(2) కింద ఈడీ సమాచారం ఇచ్చినా సంబంధిత సంస్థ చర్యలు తీసుకోని పక్షంలో, ఈడీ ప్రైవేట్ ఫిర్యాదును నమోదు చేయడానికి ప్రయత్నించడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి కలకలం.. ఆరు నెలల్లో ఏడుసార్లు టార్గెట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha