LPG eKYC Deadline: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఈకేవైసీ (e-KYC) గడువు మరియు ఆన్‌లైన్‌లో పూర్తి చేసే విధానానికి సంబంధించి. ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరియు గ్యాస్ కంపెనీలు హెచ్చరిక జారీ చేశాయి.
గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేసుకోవడానికి ఆగస్ట్ 16తో గడువు ముగియనుంది. ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు రాయితీ (Subsidy) కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నాయి.
Read Also :Gas E-KYC Process in Mobile : ఎల్పీజీ ఈ-కేవైసీ ప్రాముఖ్యత, గడువు వివరాలు
ఇంట్లోనే ఆన్‌లైన్ ద్వారా e-KYC చేసుకునే విధానం

- మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ (HP, Indane, Bharat Gas) యొక్క అధికారిక మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
- ప్లేస్టోర్ నుంచి Aadhaar FaceRD యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి.
- గ్యాస్ కంపెనీ యాప్‌లో లాగిన్ అయి, e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆధార్ అథెంటికేషన్‌కు అనుమతి ఇచ్చి, ఫేస్ స్కాన్ (Face Scan) ప్రక్రియను పూర్తి చేయండి.
ఒకవేళ ఆన్‌లైన్‌లో ఈకేవైసీ కాకపోతే, ఆధార్ కార్డ్ మరియు గ్యాస్ కనెక్షన్ వివరాలతో సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెన్సీని సంప్రదించవచ్చు. గడువు ముగిసినప్పటికీ కనెక్షన్ వెంటనే రద్దు కాదని, అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తయ్యే వరకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందే అర్హతను కోల్పోతారని స్పష్టం చేశారు. ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు.

