Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈసారైనా వైభవ్ నిరూపించుకుంటాడా?

ఈసారైనా వైభవ్ నిరూపించుకుంటాడా?

వార్త 2 weeks ago

Vaibhav Suryavanshi : ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సిక్సర్ల తుఫాను సృష్టిస్తూ లీగ్ రికార్డులను తిరగరాసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, భారత సీనియర్ జట్టులో అడుగుపెట్టిన తర్వాత తన మార్క్ దూకుడును ప్రదర్శించడంలో కాస్త తడబడ్డాడు.

ఇంగ్లాండ్ పర్యటనలోని టీ20 సిరీస్‌లో తుది జట్టులోకి వచ్చినప్పటికీ, ప్రత్యర్థి బౌలర్ల షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమై వరుసగా తక్కువ పరుగులకే (14, 13, 15) వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో, క్రికెట్ విశ్లేషకుల్లో అతని ఆటతీరుపై రకరకాల విమర్శలు వ్యక్తమయ్యాయి. గురువారం నుండి హరారే వేదికగా జింబాబ్వేతో ప్రారంభం కానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ లేకపోవడంతో వైభవ్‌కు తుది జట్టులో ఓపెనర్‌గా సుదీర్ఘ అవకాశం లభించనుంది. ఈ క్రమంలో తానెంత ప్రతిభావంతుడో మరోసారి చాటిచెప్పేందుకు ఈ సిరీస్ అతనికి ఓ బంగారు వేదికగా మారనుంది.

శ్రేయస్ సేనకు కీలకం: సూర్యవంశీ వైభవానికి ఇది సరైన సమయం!

ఇటీవల ముగిసిన విదేశీ పర్యటనల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రాక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టుకు, ఈ జింబాబ్వే పర్యటన విజయాల బాట పట్టేందుకు అత్యంత కీలకం. అయితే జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా వంటి సీనియర్లు సైతం వైభవ్‌ను “తరానికొక్కడు లభించే అరుదైన ప్రతిభ” (Generational Talent) అని కొనియాడుతూ, కొద్ది మ్యాచ్‌ల వైఫల్యాలకే ఒక చిన్న కుర్రాడిని విమర్శించడం సరికాదని మద్దతుగా నిలిచారు. సీనియర్ జట్లతో పోలిస్తే జింబాబ్వే మైదానాల్లో పరిస్థితులు కుర్రాళ్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, వైభవ్ సూర్యవంశీ తన సహజ సిద్ధమైన ధాటితో ఆడి రాబోయే ఆసియా గేమ్స్ కు ముందు భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటాడో లేదో చూడాలి.

రోహిత్ శర్మ చెప్పిన ఆ మాటతో నా మైండ్‌సెట్ మారిపోయింది.. సంజూ శాంసన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha