Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈసారి 'చలి' కూడా ఉండదా ?

ఈసారి 'చలి' కూడా ఉండదా ?

వార్త 2 weeks ago

El Niño Effect : ప్రపంచ వాతావరణంలో సంభవిస్తున్న అపసవ్య మార్పులు పర్యావరణ వేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే డిసెంబర్ నాటికి 'ఎల్ నినో' (El Niño) ప్రభావం మరింత తీవ్రతరం కానుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించిన నేపథ్యంలో, ఈసారి అసలు చలికాలమే ఉండదా అనే సందేహాలు మొదలయ్యాయి.

పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఈ ‘సూపర్ ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వింటర్ సీజన్‌లో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈ ప్రతాపం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందంటూ పాశ్చాత్య వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ పరిణామం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ చక్రం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది.

భారత్‌పై ప్రభావం ఎంత?: స్పష్టం చేసిన స్థానిక నిపుణులు

అంతర్జాతీయ వాతావరణ నిపుణులు సూపర్ ఎల్ నినో ముప్పు గురించి హెచ్చరిస్తున్నప్పటికీ, భారతదేశంలో పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చని మన దేశీయ వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ఉపఖండంలో శీతాకాల పరిస్థితులు కేవలం ఎల్ నినోపైనే కాకుండా స్థానిక భౌగోళిక అంశాలు, ఉపరితల గాలులు మరియు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ (Western Disturbances) పై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. అందువల్ల అంతర్జాతీయ అంచనాలను నేరుగా భారత్‌కు వర్తింపజేసి, ఇప్పుడే వింటర్ సీజన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. ఏదేమైనా, మారిన పర్యావరణ సమతుల్యత కారణంగా రుతుపవనాలు మరియు శీతాకాలపు పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొనే అవకాశాలనైతే కొట్టిపారేయలేము.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. అదనంగా 5 లక్షల ఇళ్ల కేటాయింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha