Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈసీ నోటీసులపై స్పందించిన కవిత!

ఈసీ నోటీసులపై స్పందించిన కవిత!

వార్త 3 weeks ago

TRS Party Name Controversy: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారిన కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ 'తెలంగాణ రక్షణ సేన' (TRS) సంక్షిప్త నామంపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పంపిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

పార్టీ పేరు మార్చుకోవాలంటూ ఈసీ పంపిన నోటీసులపై పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తమకు అందిందని, వారు లేవనెత్తిన రెండు ప్రధాన అభ్యంతరాలకు తాము ఇప్పటికే పూర్తిస్థాయిలో చట్టపరమైన సమాధానాలు ఇచ్చామని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ సంక్షిప్త నామం ఎప్పటికీ ‘TRS’ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.

Read Also:TRS Name Issue: కవిత పార్టీకి ఈసీ షాక్.. పేరు మార్చాల్సిందే!

న్యాయపోరాటానికి సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు!

కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లుగా తాము కొత్త పేర్లు గానీ, ప్రత్యామ్నాయ సంక్షిప్త నామాలు గానీ ఇచ్చే ప్రసక్తే లేదని కవిత మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. ప్రజా క్షేత్రంలో ఇప్పటికే ‘TRS’ పేరుతో తాము దూసుకుపోతున్నామని, ఈ తరుణంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈసీ తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే, దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు.

TRS Party Name Controversy:ప్రజల్లోకి ‘TRS’.. ఊహించని రాజకీయ మలుపు!

భారత్ రాష్ట్ర సమితి (BRS) నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త పార్టీని స్థాపించి, తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రాజేసేలా ‘TRS’ అనే సంక్షిప్త నామాన్ని ఎంచుకున్నారు. గతంలో తన తండ్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగిన పాత పేరును గుర్తుచేసేలా ఉండటంతో ఈ పేరు ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్లింది. అయితే, టెక్నికల్ మరియు లీగల్ అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ నుంచి 15 రోజుల గడువుతో నోటీసులు రావడం, దానికి కవిత ధీటుగా బదులివ్వడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం కవిత రాజకీయ ప్రస్థానానికి ఒక సవాల్‌గా మారినప్పటికీ, ఆమె దీనిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణలో మారిన కార్మిక శాఖ పేరు.. ఇకపై 'శక్తి' శాఖ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha