Sumathi Shatakam movie: విలేజ్ నేపథ్యంలోని కథలకు మళ్లీ ఆదరణ పెరుగుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమానే 'సుమతీ శతకం'. అమర్ దీప్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో, కథానాయికగా 'శైలి' పరిచయమైంది.
ఎమ్. ఎమ్. నాయుడు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : Ram Charan Health Update: రామ్ చరణ్ సర్జరీ సక్సెస్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్
Sumathi Shatakam movie: Sumati Shatakam Movie Review
కథ
అది ‘వైకుంఠపురం’ అనే విలేజ్. అక్కడ తన నాయనమ్మతో కలిసి కృష్ణ (అమర్ దీప్) నివసిస్తూ ఉంటాడు. కిరాణా షాప్ నడుపుతూ ఉంటాడు. ఆ ఊళ్లో ప్రతి ఏడాది ‘జాతర’ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ తతంగం చూస్తూ పెరిగిన కృష్ణ, తాను కూడా జాతర సమయంలో .. గుళ్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఊరికి ప్రెసిడెంట్ గా బుల్లిరాజు( మహేశ్ విట్టా) ఉంటాడు. అతనికి ‘రీల్స్’ పిచ్చి ఎక్కువ.
ఆ పక్కనే ఉన్న ‘సీతాపురం’లో అంగన్ వాడీ స్కూల్ టీచర్ గా ‘సుమతి’ (శైలి) పనిచేస్తూ ఉంటుంది. ఆ ఊళ్లోని వాళ్లంతా ఆమెను తమ గ్రామదేవతకి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఆమె అమ్మవారి స్వరూపం కావడం వలన, వివాహం చేసుకోవడానికి వీల్లేదనే ఒక ఆచారం బలంగా ఆచరణలో ఉంటుంది. అలాంటి సుమతిని చూడగానే, తొలిచూపులోనే కృష్ణ మనసు పారేసుకుంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
సీతాపురం గ్రామానికి చెందిన ప్రెసిడెంట్, అతనితో పాటు ఆ ఊళ్లో రౌడీయిజం చేసే ‘కొండా’, కృష్ణ తీరు పట్ల అభ్యంతరాన్ని తెలియజేస్తారు. సుమతిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదనీ, ఆమె తన జీవితాంతం అలా ఉండిపోవలసిందేనని అంటారు. ఇక వైకుంఠపురంలో దేవాలయ అభివృద్ధికి సంబంధించి తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదనే పట్టుదలతో కులవృత్తులు చేసేవారు మానేస్తారు. అలాంటి పరిస్థితులలో కృష్ణ ఏం చేస్తాడు? ఈ రెండు గ్రామాలలోని సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? అనేది కథ.
విశ్లేషణ
విలేజ్ నేపథ్యం అనగానే ప్రెసిడెంట్ అతని బృందం వాళ్ల బలహీనతలు దేవాలయం చుట్టూ ఉండే రాజకీయాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కథలోను వాటికి ప్రాముఖ్యతనిస్తూ వెళ్లారు. గామీణ వాతావరణం పెద్ద మనుషుల పంచాయతీ అక్కడి మనుషులు వారి స్వభావాలను ఆవిష్కరించే విధానంతో, సహజత్వాన్ని మన కనుల ముందు నిలిపే ప్రయత్నం చేశారు. గామీణ నేపథ్యంలోని ఏ కథలోనైనా ఆ గ్రామమే ప్రధానమైన పాత్రను పోషిస్తుందని చెప్పచ్చు. అలా ఈ కథను పూర్తి గ్రామీణ నేపథ్యంలో నడిపించారు. సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చుతూ, పల్లె అందాలు కనిపిస్తూ ఉంటాయి. కథలోని సన్నివేశాలకు .. పాత్రలకు కనెక్ట్ కావడానికి పల్లెటూరులోని లొకేషన్స్ దోహదం చేస్తూ ఉంటాయి.
నటన
ఈ పాత్ర నుంచి రావలసిన అవుట్ పుట్ మిస్సయిందనే భావన కలుగుతుంది. హీరోయిన్ కి ఇది మొదటి సినిమానే అయినా బాగానే చేసింది. కాకపోతే పాత్రను బట్టి కాస్త విశాలమైన కళ్లు ఉన్న అమ్మాయి అయితే బాగుండేదని అనిపిస్తుంది. ఈ కథలో కొన్ని చిన్న చిన్న పాత్రలు కనిపిస్తాయి. వాళ్ల నుంచి సరైన అవుట్ పుట్ రాలేదు. వాళ్లు అప్పగించినట్టుగా డైలాగ్స్ చెప్పడం వలన ఆడియన్స్ కి అసహనం కలుగుతుంది.
ముగింపు
ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ మార్కులు ఎవరికి లభిస్తాయంటే సంగీత దర్శకుడు సుభాశ్ ఆనంద్ పేరునే చెప్పుకోవలసి ఉంటుంది. ఆ తరువాత స్థానం డీఓపీ హాలేశ్ కి దక్కుతుంది. కొరియోగ్రఫీ ఫరవాలేదు. నహీద్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఇది విలేజ్ నేపథ్యంలో వచ్చిన ఓ రొటీన్ కంటెంట్ గానే చెప్పుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
'నాన్-బయోలాజికల్ మ్యాడ్నెస్'.. ప్రధాని తీరుపై కాంతార నటుడు ఫైర్?

