FBI Director Kash Patel email hack: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ లక్ష్యంగా భారీ సైబర్ దాడి జరిగింది.
ఇరాన్ ప్రభుత్వ నిఘా విభాగంతో సంబంధాలున్నట్లు భావిస్తున్న 'హండాలా' (Handala) హ్యాకర్ల బృందం, పటేల్ వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాను హ్యాక్ చేసినట్లు ప్రకటించింది.
Read Also: Iran oil tanker attack : హర్మూజ్‌లో ట్యాంకర్‌పై దాడి.. ఇరాన్ సంచలనం
ఈ విషయాన్ని ఇరాన్ హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ సైబర్ దాడిలో భాగంగా వారు ఆయనకు సంబంధించిన కొన్ని ఈమెయిళ్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలతో కూడిన రెజ్యూమెను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు కూడా. ఈ మొత్తం అంశం రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది.దీనికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు ఇరాన్ కు చెందిన హందాలా హ్యాక్ టీమ్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ఈ హ్యకర్స్ టీమ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
FBI Director Kash Patel
ఈ చర్యకు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించింది. దీనిని ఒక "అత్యంత ప్రముఖ సైబర్ చొరబాటు"గా ఆ టీమ్ సభ్యులు స్పష్టంగా అభివర్ణించారు. కష్ పటేల్ ఇప్పుడు విజయవంతంగా హ్యాక్ అయిన బాధితుల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.. అని హ్యాకర్లు పేర్కొన్నారు. లీక్ అయిన ఈమెయిళ్లు, ఇతర డాక్యుమెంట్ల ప్రామాణికత గానీ, అందులో ఉండే వివరాలన గానీను రాయిటర్స్ తక్షణమే ధృవీకరించలేకపోయింది. అయినప్పటికీ వార్తా సంస్థ పరిశీలించిన మెటీరియల్ నమూనాలో 2010 నుండి 2019 వరకు కాష్ పటేల్ కు చెందిన వ్యక్తిగత, వృత్తిపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నట్లు తన కథనంలో ప్రచురించింది.
FBI Director Kash Patel email hack: ఎఫ్‌బీఐ స్పందన
ఈ ఘటనపై అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి స్పందించినట్లు రాయిటర్స్ తెలిపింది. కష్ పటేల్ ఈమెయిళ్లు నిజంగానే లీక్ అయినట్లు ధృవీకరించారు. ఈ సైబర్ ఉల్లంఘన పూర్తి స్థాయిని లేదా దాని సున్నితత్వాన్ని గురించి అదనపు వివరాలు మాత్రం అందుబాటులో లేవని పేర్కొన్నట్లు రాయిటర్ వివరించింది. హ్యాకింగ్ సమాచారంపై ఎఫ్బీఐ ఇంకా స్పందించలేదు. దీనిపై ఓ పూర్తిస్థాయి నివేదిక వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

