Jobs : భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ (ఇండియా పోస్ట్) దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా దాదాపు 25,000 ఖాళీలను భర్తీ చేయనుండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లో 918, తెలంగాణలో 419 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 18 నుండి 40 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 19 వరకు అధికారిక పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
DRDO CAIR AI Internship 2026ఎంపిక విధానం మరియు దరఖాస్తు సమాచారం
ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా కేవలం 10వ తరగతి (ఎస్సెస్సీ)లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై పట్టు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ని సందర్శించి ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతకు ఇది అత్యుత్తమ ప్రభుత్వ ఉద్యోగ అవకాశంగా నిలుస్తోంది.

