LPG Cylinder : దేశంలోని ఆయిల్ కంపెనీలో ఎల్బీజీ కనెక్షన్ ఉన్నవారు ఇకేవైసీ చేసుకోవాలని సంవత్సర కాలంగా చెబుతూ వస్తున్నారు. ఎల్పీజీ ఇకేవాసీ గడువు ఆగస్ట్ 16న ముగియగా..
దాన్ని ఆగస్ట్ 23 వరకు పొడగించారు. ఆ గడువు ఆదివారంతో పూర్తి అయింది. దీంతో ఎవరైతే ఎల్పీజీ కనెక్షన్ ఇకేవైసీ చేసుకోలేదో వారికి సిలిండర్లు సరఫరా బంద్ కానుంది. వారు ఒక వేళ ఇప్పుడు ఇకేవైసీ చేసినా.. సిలిండర్లు వచ్చే గ్యారెంటి లేదని తెలుస్తోంది. అయితే చాలా మంది చివరి నిమిషంలో ఇకేవైసీ చేసుకోవడానికి గ్యాస్ ఎజెన్సీలకు పరుగులు తీశారు. దీంతో సర్వర్లు బిజీగా మారాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు ముగియడంతో సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
Read Also: Gyanesh Kumar: ఈవీఎంలపై అపోహలు వద్దు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
LPG Cylinder
LPG Cylinder: గడువు పొడగించని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
గడువును పెంచాలని కస్టమర్లు కోరుతున్నప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం గడువు పొడగించలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి ఆగస్టు 24 నుంచి సిలిండర్ బుకింగ్స్, సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు ఆగస్టు 23తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 వరకు గడువును మళ్లీ పెంచాలని కస్టమర్లు, డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కంపెనీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పటికే చాలా మంది వినియోగదారులకు సిలిండర్లు బుక్ కావడం లేదు. ఇ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

