Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్నినో ను లెక్కచేయని తెలంగాణ రైతులు

ఎల్నినో ను లెక్కచేయని తెలంగాణ రైతులు

వార్త 5 days ago

El Niño Effect : తెలంగాణలో యాసంగి పంటల సాగుపై వ్యవసాయశాఖ కీలక అంచనాలు వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణం భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ఈ సీజన్‌లో సుమారు 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా యాసంగిలో 68.67 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, ఈసారి అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవచ్చని అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవించే అవకాశం ఉండటంతో సాగునీటి లభ్యత కీలకంగా మారనుంది. ముఖ్యంగా వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల సాగుపై నీటి కొరత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతుండటంతో వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళికలపై దృష్టి సారించింది.

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచన

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగునీటి లభ్యత తగ్గే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా వరి సాగుపై ఆధారపడకుండా తక్కువ నీటితో పండించగల పంటలవైపు రైతులను మళ్లించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ, శనగ, మినుములు, పెసర వంటి పంటల సాగును ప్రోత్సహించనుంది. ఈ పంటలను ఎంచుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు నీటి కొరత వల్ల కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చని వ్యవసాయశాఖ భావిస్తోంది. రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, నీటి లభ్యత, పంటలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్‌నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపై స్పష్టత వచ్చే వరకు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచుకోవడం రైతులకు ప్రయోజనకరంగా మారనుంది.

హైదరాబాద్ -విజయవాడ హైవేపై 4KM ట్రాఫిక్ జామ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha