LPG e-KYC:ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ త్వరగా ఎల్పీజీ ఈకేవైసీ పూర్తి చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి.
ఈ ప్రక్రియ కోసం ఆగస్టు 23 వరకు గడువు పొడిగించారు. ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ అందాలంటే ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేయడం చాలా ముఖ్యం.
Read also: Chicken price: నాన్ వెజ్ ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్
LPG e-KYC deadline extended
సర్వర్ సమస్యలు మరియు డీలర్ల సూచనలు
ఆన్‌లైన్ ద్వారా కేవైసీ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా చాలా మందికి ఈ ప్రక్రియ పూర్తి కావట్లేదని డీలర్లు తెలిపారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు ఆందోళన చెందకుండా ఉండేందుకు గడువు పెంచడం జరిగింది.
LPG e-KYC:సబ్సిడీ నిలిచిపోకుండా జాగ్రత్తలు
నిర్ణయించిన గడువులోగా కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు వెంటనే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సందర్శించి లేదా ఆన్‌లైన్ సేవలను ఉపయోగించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండవచ్చు.
Epaper: epaper.vaartha.com

