Eluru district:ఏలూరు జిల్లాలో తుఫాను దెబ్బకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాల కారణంగా సుమారు 35 వేల ఎకరాల్లో వరి పంట, మరో నాలుగు వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఈ భారీ నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు.
Cyclone Arnab: తుఫాన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో సెలవులు
Crop loss across 35,000 acres in Eluru
కళ్లముందే నీట మునిగిన అన్నదాతల కష్టాలు
ఏలూరు జిల్లాలో తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల అన్నదాతలు రోడ్డున పడ్డారు. అప్పటివరకు చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట నాశనమవడం రైతన్నలను తీవ్ర వేదనకు గురిచేసింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Eluru district:పంట నష్టాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు
నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో ప్రతి పొలాన్ని పరిశీలించి నష్టపోయిన రైతుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించి అర్హులైన ప్రతి రైతుకూ త్వరలోనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Epaper: epaper.vaartha.com

