Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏం కొనేటట్టు లేదు.. తెలంగాణలో పెరిగిన బియ్యం, చికెన్, గుడ్ల ధరలు!

ఏం కొనేటట్టు లేదు.. తెలంగాణలో పెరిగిన బియ్యం, చికెన్, గుడ్ల ధరలు!

వార్త 2 weeks ago

TG Essential Commodities Price: నిత్యం ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబం అనుభవిస్తున్న నరకం. బజారుకు వెళ్తే బియ్యం, పప్పులు, కూరగాయల ధరలు చూసి సామాన్యుడు భయాందోళనకు గురవుతున్నాడు.

పచ్చడి చేసుకుని తిందామన్నా పచ్చిమిర్చి సెగ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. నెలాఖరుకు వచ్చే నామమాత్రపు జీతంతో పెరుగుతున్న ఈ ధరల మంటను తట్టుకోలేక సగటు మిడిల్ క్లాస్ మనిషి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండిస్తూ తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సగటు మనిషి పళ్లెంలో సన్న బియ్యం అన్నం మాయమైపోతోంది. పంట ఉత్పత్తి పుష్కలంగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత రెండున్నర నెలల వ్యవధిలోనే కేజీ సన్న బియ్యం ధర రూ.10 నుంచి రూ.12 వరకు అదనంగా పెరిగింది. నిత్యం వాడే సోనా మసూరీ, బిపిటి, ఐఆర్-64 వంటి రకాల క్వింటాల్ ధర మార్కెట్‌లో రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగింది. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గుతుందనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమ నిల్వలకు పాల్పడటం వల్లనే ఈ ధరల మంట రగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read Also : TG EAPCET Seat Allotment Result: నేడే ఫేజ్-2 సీట్ల కేటాయింపు ఫలితాలు: అలాట్‌మెంట్ ఆర్డర్స్ డౌన్‌లోడ్ లింక్ ఇదే!

 Nothing is affordable… Prices of rice, chicken, and eggs have risen in Telangana!

TG Essential Commodities Price: చుక్కలు చూపిస్తున్న ప్రొటీన్ ఆహార ధరలు

అటు బియ్యం షాక్ నుంచి కోలుకోకముందే, ప్రొటీన్ ఆహారమైన కోడిగుడ్డు, చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటివరకు అందుబాటులో ఉన్న కోడిగుడ్డు ధర కొద్దిరోజుల్లోనే రూ.8.50కు చేరడంతో పేద, గిరిజన కుటుంబాలు కొనుగోలు చేయడానికి వెనకాడుతున్నాయి. ఇక వారాంతంలో చికెన్ తిందామంటే కేజీ లైవ్ డ్రెస్సింగ్ కోడి మాంసం రూ. 350 మార్కును తాకింది. దీంతో ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్‌వైపు వెళ్లడానికే గృహిణులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

రైతుబజార్లలో కూరగాయల మంట

నిత్యావసర సరుకుల బాదుడు ఒకవైపు ఉంటే, రోజూ వంటల్లో వాడే కూరగాయల కోసం రైతుబజారుకు వెళ్లినా జేబులు ఖాళీ కాక తప్పడం లేదు. నామమాత్రపు రేటుకే లభించే టమాటా, ఉల్లిపాయలు సైతం ప్రియమైపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న సగటు కూరగాయల ధరల వివరాలు:

  • టమాటా: కేజీ రూ. 40 నుంచి రూ. 60
  • పచ్చిమిర్చి: కేజీ రూ. 40 నుంచి రూ. 60
  • ఉల్లిపాయలు: కేజీ రూ. 40 నుంచి రూ. 55
  • బెండకాయ / వంకాయ: కేజీ రూ. 40 నుంచి రూ. 50
  • క్యారెట్ / బీట్‌రూట్: కేజీ రూ. 50 నుంచి రూ. 60

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు తొలిరోజే సర్వర్ మొరాయింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha