Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఎమ్ఆర్ పీ'(అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

'ఎమ్ఆర్ పీ'(అమెజాన్ ప్రైమ్) సినిమా రివ్యూ!

వార్త 1 week ago

MRP Movie Review: యువ నటుడు నరేశ్ అగస్త్య వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా డార్క్ క్రైమ్ కామెడీ జోనర్‌లో ఆయన చేస్తున్న సినిమాలకు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఇదే కోవలో ఆయన నటించిన తాజా చిత్రం ‘ఎమ్ఆర్ పీ’ (MRP – నీకెంత నాకెంత). శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన తక్కువ కాలంలోనే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

మూడు స్నేహితులు, అప్పుల తిప్పలు.. అసలు కథేంటంటే?

మనోహర్ (నరేశ్ అగస్త్య), పరమేశ్వర్ (సుదర్శన్), రవి (కసిరెడ్డి రాజ్ కుమార్) మంచి స్నేహితులు. హైదరాబాద్‌లో ఒకే గదిలో ఉంటుూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. మనోహర్ అదే ఆఫీసులో పనిచేసే అమృతతో ప్రేమలో ఉంటాడు. అయితే, తన తక్కువ జీతంతో జీవితంలో పెద్ద స్థాయికి ఎదగాలని, సొంతంగా బిజినెస్ చేయాలని భావిస్తాడు. దీనికోసం భారీగా డబ్బు అవసరమవడంతో ముగ్గురు స్నేహితులు తమ సొంతూరికి వెళ్లి డబ్బు కోసం ప్రయత్నిస్తారు కానీ ఫలితం ఉండదు.

అదే సమయంలో ఊరిలో కామేశ్వర రావు అనే వ్యక్తి హత్య జరుగుతుంది. కామేశ్వరరావుకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ‘దైవాజీ’ (నంద గోపాల్) రౌడీ షీటర్ కాగా, చిన్న కొడుకు ‘భాను’ తండ్రిని బాగా చూసుకుంటాడు. దైవాజీ వద్ద అప్పు తీసుకున్న మిత్రబృందం, గడువులోగా వడ్డీ చెల్లించలేకపోతుంది. దీంతో వారు కామేశ్వరరావు డెడ్ బాడీని ఆసుపత్రి నుంచి రహస్యంగా తరలించి, భానుకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ చేస్తంటారు. అయితే, అసలు ట్విస్ట్ ఏంటంటే.. కామేశ్వరరావు బాడీ స్థానంలో ఒక అంతుచిక్కని మహిళ శవం వీరి చేతికి వస్తుంది. ఆ మృతదేహం ఎవరిది? హీరోల పరిస్థితి ఏంటన్నదే ఈ సినిమా కథ.

MRP Movie Review: డెడ్ బాడీల చుట్టూ తిరిగే కథ.. సెకండాఫ్ కన్ఫ్యూజన్ డ్రామా

మొదటి సగభాగం స్నేహితుల సరదా తిరుగుళ్లు, ప్రేమ వ్యవహారాలు, డబ్బు కోసం పడే పాట్లు వంటి సాధారణ సన్నివేశాలతో సాగుతుంది. ఇక తాము పొరపాటున తెచ్చిన మహిళా శవం ఎవరిదో తెలుసుకోవడానికి హీరోలు చేసే ప్రయత్నాలు, తండ్రి శవం కోసం కొడుకులు వెతికే విధానంతో సెకండాఫ్ నడుస్తుంది. మధ్యలో సుదర్శన్, కసిరెడ్డి కామెడీకి తోడు ‘మ్యాగ్నెట్ మణి’ పాత్రలో వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇస్తాడు. అయితే, రౌడీలు మరియు డెడ్ బాడీల కాన్సెప్ట్ గతంలో చాలా సినిమాలలో వచ్చినట్లే రొటీన్‌గా అనిపిస్తుంది.

బలహీనమైన కథనం, పేలవంగా పండిన కామెడీ

గతంలో డెడ్ బాడీల నేపథ్యంలో వచ్చిన క్రైమ్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విచాయి. కానీ ఈ చిత్రంలో కామెడీని జనరేట్ చేసే నటులు ఉన్నప్పటికీ, బలమైన కామెడీ సీన్లు రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డారు. లవ్, రొమాన్స్, ఎమోషన్స్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉత్కంఠను రేకెత్తించకపోవడం మైనస్‌గా మారింది. విలన్ పాత్రల తీరు ఒక స్టేజ్ డ్రామాను తలపించేలా సిల్లీగా అనిపిస్తుంది. హీరో-హైడ్రోయిన్ మధ్య వచ్చే ‘ఒక్కమాటే’ సాంగ్ మినహా మిగిలిన పాటలు అంతగా రిజిస్టర్ కావు.

సాంకేతిక నిపుణుల పనితీరు మరియు తుది మాట

సినిమాలో ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం చాలా సాధారణంగా ఉన్నాయి. సాగదీత సీన్ల వల్ల ఎడిటింగ్ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తుంది. మంచి క్రైమ్ కామెడీ జోనర్ ప్లాన్ చేసుకున్నప్పటికీ, స్క్రీన్ ప్లే లోని పట్టు లేకపోవడం సినిమాను బలహీనపరిచింది. పెద్దగా అంచనాలు లేకుండా, వీకెండ్‌లో టైమ్‌పాస్ కోసం అక్కడక్కడా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయడానికి ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha