Dailyhunt
ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. కారణం ఇదే?

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. కారణం ఇదే?

వార్త 1 week ago

MLC Anantha Babu Arrest: తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. వివాదాస్పద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

శుక్రవారం (ఏప్రిల్ 24, 2026) రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద విచారణ ముగించుకుని బయటకు రాగానే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని, ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Read Also: Srisailam: మల్లన్న హుండీలో కాసుల వర్షం.. విదేశీ కరెన్సీ ఎంతొచ్చిందో తెలుసా?

శుక్రవారం విచారణ

దీంతో అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ఇటీవల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి అనంతబాబు కనిపించకుండా పోయారు. అనంతబాబును అరెస్ట్ చేసేందుకు పోలీసులు విజయవాడ, విశాఖపట్నం సహా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గాలించారు. మరోవైపు సాక్షులను బెదిరించారని తనపై నమోదైన కేసును కొట్టివేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

 MLC Anantha Babu Arrest

తన పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ మీద శుక్రవారం విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.ఇదే సమయంలో అనంతబాబు బెయిల్‌ షరతులు ఉల్లంఘించారని.. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ కోసం అనంతబాబు రాజమహేంద్రవరం కోర్టుకు రాగా.. కోర్టు నుంచి బయటకు రాగానే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మరో పది రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha