Anirudh Reddy vs Manchu Vishnu: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఇప్ప పువ్వు సారా అంశంపై అసెంబ్లీలో గళమెత్తిన ఆయన, తాజాగా డ్రగ్స్ నియంత్రణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే డ్రగ్స్ అనే ముద్ర పడుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, హీరోలు తమ అభిమానులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. సమాజంలో మార్పు రావాలంటే సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.
Read Also:Telangana: మహిళా సాధికారతకు 'మహాలక్ష్మి' కిరీటం: రూ. 10 వేల కోట్ల ఆదా
Anirudh Reddy vs Manchu Vishnu: 90 రోజులకు ఒకసారి టెస్టులు: ఎమ్మెల్యే ప్రతిపాదన
సినిమా హీరోలు ప్రతి మూడు నెలలకు (90 రోజులు) ఒకసారి స్వచ్ఛందంగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని అనిరుధ్ రెడ్డి సూచించారు. ఆ రిపోర్టులను బహిరంగంగా ఉంచడం ద్వారా డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. “హీరోలు ఏం చేస్తే ఫ్యాన్స్ అదే చేస్తారు, కాబట్టి వారు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
మంచు విష్ణు కౌంటర్
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై ‘మా’ (MAA) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ఎమ్మెల్యే సూచనను స్వాగతిస్తూనే, పరోక్షంగా చురకలు అంటించారు. రాజకీయ నాయకులు కూడా ఎన్నికల నామినేషన్ వేసే ముందు ఇలాంటి పారదర్శక పరీక్షలు చేయించుకుంటే బాగుంటుందని తాను ఆలోచిస్తున్నట్లు విష్ణు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా ఇలాగే పారదర్శకంగా ఉంటే ఓటర్లు సంతోషిస్తారని ఆయన కౌంటర్ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
యాసంగి పంటలకు సాగునీరు అందించండి: మంత్రి ఉత్తమ్ కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ

