Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్

వార్త 3 months ago

Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన తరుణంలో, అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

సోమవారం ముఖ్యమంత్రిగా విజయ్ మరియు ఆయన మంత్రిమండలిలోని 9 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ ప్రారంభమైంది. ఇదే సమయంలో డీఎంకే పక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అయితే, గతంలో సినీ రంగంలో మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ, రాజకీయ రణరంగంలో మాత్రం ఒకరినొకరు కనీసం పలకరించుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also:Tamil Nadu: సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్

Udhayanidhi Stalin: ఎదురెదురుగా కూర్చున్నా వీడని మౌనం!

ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తన కేటాయించిన సీటులో కూర్చోగా, ఆయనకు సరిగ్గా ఎదురుగా ప్రతిపక్ష నేత సీటులో ఉదయనిధి స్టాలిన్ కూర్చున్నారు. సభ సాగుతున్నంత సేపు ఇద్దరు నేతలు ఎదురెదురుగా ఉన్నప్పటికీ, కనీసం కంటిచూపుతో కూడా సంజ్ఞ చేసుకోలేదు. ఒకరినొకరు అసలు చూడలేదన్నట్లుగా, పక్కన ఎవరూ లేరన్నట్లుగా వ్యవహరించడం అక్కడి వాతావరణంలో ఉన్న తీవ్రతను స్పష్టం చేసింది. రాజకీయంగా ఇద్దరూ విభిన్న ధృవాలుగా మారిన తీరుకు ఈ సంఘటన అద్దం పట్టింది.

విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ద్వారా వారసత్వ రాజకీయాలపై యుద్ధం ప్రకటించడం, దానికి ప్రతిగా డీఎంకే శ్రేణులు విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలు వీరి మధ్య దూరాన్ని పెంచాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత స్నేహం కంటే రాజకీయ సిద్ధాంతాలకే ప్రాధాన్యత ఇస్తూ, అసెంబ్లీలో ఇద్దరు నేతలు ప్రదర్శించిన ఈ ‘మౌన యుద్ధం’ భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలు ఎంత రసవత్తరంగా సాగనున్నాయో ముందే సూచిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తండ్రిని అన్‌ఫాలో చేసిన కొడుకు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha