Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు అత్యంత స్పష్టమైన, కఠినమైన హెచ్చరిక చేశారు.
ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. “మేము ప్రజలకు సేవకులం మాత్రమే, ఏ ఒక్కరూ పెత్తందారుల్లా ప్రవర్తించినా చూస్తూ ఊరుకోబోము. ఈ నిబంధన కూటమిలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది” అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించని వారి పట్ల ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తి లేదని సీఎం తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
CM Chandrababuగాడిలో పడ్డ అధికార యంత్రాంగం - బాధ్యతాయుత పాలనే ధ్యేయం
రాష్ట్రంలో ఇప్పటికే అధికారులను గాడిలో పెట్టామని, పాలనా యంత్రాంగం వేగంగా, సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో సత్ఫలితాలు సాధించాలంటే కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా అంతే బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటూ, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సంక్షేమానికి శ్రమించాలని పిలుపునిచ్చారు. సీఎం ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్‌తో కూటమి నేతల్లో మరియు ప్రజాప్రతినిధుల్లో నూతన బాధ్యతాయుత వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

